హెల్మెట్‌లో విషనాగు.. 11 కిలోమీటర్లు ప్రయాణం... స్పృహతప్పి..?

snake
snake
సెల్వి| Last Updated: బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (17:58 IST)
బైకుపై ప్రయాణం చేస్తే.. హెల్మెట్ తప్పనిసరి. అయితే ఆ హెల్మెటే ఓ వ్యక్తికి ప్రాణానికి ముప్పుగా మారింది.
కేరళకు చెందిన ఓ వ్యక్తి ధరించిన హెల్మెట్‌లో ఓ విష నాగు వున్నది. పాము హెల్మెట్‌లో వున్న విషయం తెలియకుండానే ఆ వ్యక్తి 11 కిలోమీటర్ల మేర బండిని నడిపాడు.

వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఓ ఉపాధ్యాయడు.. పాఠశాల పనిని ముగించుకుని ఇంటికి ప్రయాణమైనాడు. ఆ సమయంలో 11 కిలోమీటర్లు ప్రయాణించిన అతను.. ఉన్నట్టుండి బండిని నిలిపాడు. ఆపై హెల్మెట్‌లో ఏదో వున్నట్లు గ్రహించి చూశాడు.

అంతే షాకై, స్పృహ తప్పి పడిపోయాడు. అటు పిమ్మట అతనిని పరిశోధించిన వైద్యులు అతని శరీరంలో విషం ఎక్కలేదని ధ్రువీకరించారు. దీంతో అదృష్టం కొద్దీ బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.దీనిపై మరింత చదవండి :