మహిళపై గ్యాంగ్ రేప్ చేసి తప్పించుకోబోయి చచ్చాడు.. మరొకడు చావుబతుల మధ్య...

rape
ఐవీఆర్| Last Modified బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:33 IST)
తెలంగాణ సంగారెడ్డిలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ఇద్దరు నిందితులు తప్పించుకోబోయి ప్రమాదానికి గురై ఒకరు చనిపోగా మరొకడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంగళవారం రోజు బీదర్ నుండి సూర్యాపేటకు వెళ్తున్న ఓ వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లు గమనించారు ఇద్దరు దుండగులు. తాము పోలీసులమంటూ బెదిరించి ఆమెను బస్సు నుంచి దింపారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని ఇద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బుధవారం నాడు కారులో వెళుతూ పోలీసులకి కన్పించారు. దీనితో పోలీసు వాహనంలో వారిని పట్టుకునేందుకు బయలుదేరారు పోలీసులు. వారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని వేగంగా కారును నడుపుతూ వుండటంతో అది అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుకులాడుతున్నాడు.దీనిపై మరింత చదవండి :