శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 22 ఏప్రియల్ 2020 (22:31 IST)

హైదరాబాదులో నలుగురు ఆత్మహత్య, వీడిన మిస్టరీ, చేతబడి చేశారనీ...

హైదరాబాదులో కుటుంబం ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. కుటుంబానికి చేతబడి చేశారన్న అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడిన తీరు ఇది. తమకు గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేశారన్న అనుమానంతో కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లాలోని దారూరు మండలంకు చెందిన సువర్ణబాయి గత కొంత కాలం నుంచి హైదరాబాదులో నివాసముంటున్నారు.
 
ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇందులో హరీష్ ఆన్లైన్ మార్కెటింగ్‌లో పనిచేస్తున్నాడు. గత కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో అనారోగ్యం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యల కోసం తమ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను మొత్తం కూడా ఖర్చు పెట్టారు. అయినప్పటికీ కూడా  వీరికి ఆరోగ్యం బాగు కాకపోవడంతో, అంతేకాకుండా తనకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేశారన్న అనుమానం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గుళ్ళూ గోపురాలు తిరిగారు. 
 
అయినప్పటికీ కూడా ఆరోగ్యం బాగు కాలేదు. అయితే తనకు గుర్తుతెలియని వ్యక్తులు చేతబడి చేశారన్న అనుమానం ఎప్పటినుండో ఈ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఈ నేపథ్యంలోనే నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సందర్భంలో ఒక ఆత్మహత్య లేఖ రాయడం జరిగింది. ఇందులో తమ చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమకు ఎవరో చేతబడి చేశారని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలోనే తమ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అమ్మివేసి మరి ఆరోగ్యం కోసం పూర్తిగా ఖర్చు చేసామనీ, అయినా కూడా ఆరోగ్యం బాగుపడ లేదనీ, దీంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చిందని లేఖలో వుంది. తన దగ్గరున్న ఆస్తిపాస్తులనన్నిటిని ఖర్చు చేసినప్పటికీ తాము పూర్తిస్థాయిలో కోలుకొలేక పోయాము కాబట్టి ఈ నేపథ్యంలోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు నలుగురు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
హరీష్ ఒక్కడే ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా, మిగతా ముగ్గురు విషం సేవించి  ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే తమ మృతదేహాలను ఎవరికి అప్పగించకూడదని, అంతేకాకుండా పోస్టుమార్టం నిర్వహించకూడదని పోలీసులకు సూచించారు. అదే కాకుండా తమ దగ్గరున్న తమ ఇంట్లో ఉన్న కొద్దిపాటి వస్తువులను ఎవరెవరికి  ఇవ్వాలన్న విషయం కూడా సూసైడ్ లేఖలో రాసుకున్నారు. సూసైడ్ లేఖ బయటపడటంతోనే వీళ్ళ ఆత్మహత్య మిస్టరీ వీడిపోయింది.