గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (23:13 IST)

సమ్‌టోటల్ సిస్టమ్స్ (స్కిల్‌సాఫ్ట్) కోవిడ్-19తో పోరాడటానికి రూ. 10 లక్షలు

కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా రాష్ట్ర పోరాటానికి తోడ్పడే ప్రయత్నంలో టాలెంట్ డెవలప్మెంట్ సూట్ యొక్క ప్రముఖ ప్రొవైడర్ సమ్‌టోటల్, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం 8 లక్షల రూపాయల సహాయాన్ని అందించింది. 
 
ఈ ఆర్ధిక సహాయం వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను బలోపేతం చేయడం మరియు సమాజంలోని నిరుపేద ప్రజలకు సహాయం చేయడం ఆర్ధిక సహాయం చేయడం లక్ష్యంగా కలిగి ఉంది. మహమ్మారి బారిన పడి బాధపడుతున్న వ్యక్తుల కోసం మరియు అవసరమైన ఆరోగ్య సదుపాయాలను కల్పించడం ద్వారా సమాజంలో దాని వ్యాప్తిని తగ్గించడానికి ఈ మొత్తాన్ని అధికారులు ఉపయోగించుకుంటారు.
 
కృష్ణ ప్రసాద్ (సీనియర్ డైరెక్టర్ హెచ్ఆర్, ఎపిఎసి), అంకుర్ గుప్తా (సీనియర్ డైరెక్టర్ మార్కెటింగ్), సుబ్రమణ్యం గుట్టి (సీనియర్ డైరెక్టర్ ఫైనాన్స్) మరియు చంద్రమౌలి(డైరెక్టర్ ఫెసిలిటీస్)లతో సమ్‌టోటల్ సిస్టమ్స్ ఇండియా మేనేజ్మెంట్ అందరూ శ్రీ కె.టి. రామారావు, ఎంఏ అండ్ యుడి, పరిశ్రమలు, ఐటి అండ్ సి మంత్రి గారిని కలిసి తమ సహకారాన్ని అందచేశారు.

ఈ నిధి మొత్తాన్ని సమ్‌టోటల్ సిస్టమ్ ఉద్యోగుల సహాయంతో సేకరించారు. సైబరాబాద్ పోలీసులు తమ రోజువారీ విధులకు అవసరమైన వనరులు మరియు సామగ్రిర్లతో సన్నద్ధం కావడానికి సమ్ టోటల్ సిస్టమ్స్ సైబరాబాద్ పోలీసులకు అదనంగా 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చింది.