గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (21:50 IST)

కరోనా సోకిన చైనా డాక్టర్లు నల్లగా మారిపోయారు.. కోవిడ్-19 అలా పుట్టలేదట..?

కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతుంది. ఈ పేరు చెబితేనే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతోంది. రోజు రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి గురించి మరో కొత్త విషయం వెలుగుచూసింది. అదేంటంటే.. కరోనా వైరస్ సోకి పరిస్థితి విషమిస్తే మన చర్మం రంగు మారిపోతుందట. ఇలా చైనాకు చెందిన ఇద్దరు డాక్టర్లకు జరిగింది. వారి చర్మం తెలుపు నుంచి నలుపుగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. కరోనా పుట్టినిల్లు వూహాన్‌కు చెందిన వైద్యలు యీ ఫాన్, హు వెయ్‌ఫెంగ్ ఇద్దరికీ కొవిడ్-19 వ్యాధి వచ్చింది. రెండు నెలలపాటు ఈ వైరస్‌తో పోరాడిన వీళ్లు చివరకు కోలుకున్నారు. కానీ వీరి చర్మం రంగు నల్లగా మారిపోయింది. కరోనా ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా మారడంతో వీరి లివర్లు పాడయ్యాయని, దీంతో చర్మం రంగు మారిపోయిందని వైద్యులు తెలిపారు.
 
ప్రపంచానికి చెమటలు పట్టిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వ్యక్తం చేసింది. వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని, ల్యాబ్‌లో వైరస్ ఉద్భవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 
 
ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో ప్రత్యేక అధికారిణి ఫడేలా చైబ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైరస్‌కు జంతువులే జన్మస్థానంగా నిలిచాయని, ల్యాబ్‌లలో దీన్ని సృష్టించలేదని పేర్కొన్నారు. అన్నిరకాల ఆధారాలు దీన్నే రుజువు చేస్తున్నాయని తెలిపారు. అయితే గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా ఎలా వ్యాపించిందన్న విషయంపై ఇంకా పూర్తి వివరాలు కనుగొనాల్సి ఉందన్నారు.