శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:59 IST)

అమెకాలో కేరళ వైద్యురాలికి అరుదైన గౌరవం

కరోనా వైరస్ బాధిత దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. ఈ దేశ వాణిజ్య నగరమైన న్యూయార్క్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేసింది. ఇప్పటికి కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. అయినప్పటికీ కరోనా వైరస్ కట్టడికి ఆ దేశ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇండో - అమెరికన్ వైద్యురాలికి ఓ అరుదైన గౌరవం లభించింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసినందుకుగాను ఆమెకు ఈ గౌరవం దక్కిది. అదీ కూడా వంద కార్ల ర్యాలీతో సెల్యూట్ ప్యారెడ్ నిర్వహించారు. 
 
ఈ వైద్యురాలు అమెరికాలోని సౌత్ విండర్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మైసూర్‌కు చెందిన ఈ వైద్యురాలి పేరు డాక్టర్ ఉమా మధుసూదనన్. అమెరికాలో స్థిరపడిపోయారు. ఈమె కరోనా రోగులకు వైద్యం చేసినందుకుగాను... ఆమె ఇంటి ముందు నుంచి వందకార్లు వెళుతూ, కొన్ని నిమిషాల పాటు ఆపి సెల్యూట్ చేశారు. 
 
ఈ కార్ల ర్యాలీలో అనేక పోలీసు వాహనాలతో పాటు ఫైర్ బ్రిగేడ్ ట్రక్కులు, ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి. కనీసం 100 వాహనాల కాన్వాయ్ డాక్టర్ ఉమా ఇంటిని కొన్ని సెకన్ల పాటు ఆపి, ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.