1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. MGR University honours Mohan Babu with the doctorate on 4th October

సినీ నటుడు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్

తెలుగు సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మన

Mohan Babu
తెలుగు సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. 
 
ఈ గౌరవ డాక్టరేట్‌ను ఈనెల 4వ తేదీన అందుకోనున్నాడు. దీనిపై ఆయన చేసిన ట్వీట్‌లో... ‘కంగ్రాట్స్ నాన్నా.. ఎంతో గర్వపడే క్షణం’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఫొటోను పోస్ట్ చేశాడు. 
 
కాగా, సినీ నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా మోహన్ బాబు తనదైన ముద్ర వేశారు. సుమారు 560 చిత్రాల్లో నటించిన ఆయన, టీడీపీ తరపున గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో మోహన్ బాబును భారత ప్రభుత్వం గౌరవించిన విషయం తెల్సిందే. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఒకే వేదికపై రజనీ - కమల్ : ఎడమొహం.. పెడమొహంగా...