1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Nagarjuna to pair up with Miss India Manasa?

కొత్త హీరోయిన్‌పై కన్నేసి టాలీవుడ్ 'మన్మథుడు'

manasa varanasi
టాలీవుడ్ 'మన్మథుడు' కింగ్ అక్కినేని నాగార్జున కొత్త హీరోయిన్‌పై కన్నేశారు. తాను నటించే కొత్త చిత్రంలో హీరోయిన్‌గా మనస వారణాసికి అవకాశం కల్పించారు. ఈ చిత్రం ద్వారా ప్రసన్న కుమార్ దర్శకుడిగా ఈ చిత్రం తెరక్కనున్నారు. ఇది నాగార్జున నటించే 99వ చిత్రం కావడం గమనార్హం. 
 
ఈ చిత్రం ద్వారా కొత్త హీరోయిన్‌ను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈమె గతంలో మిస్ ఇండియా వరల్డ్‌గా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి... అందాల పోటీలు, మోడలింగ్‌లలో ఇప్పటికే ఆమెకు మంచి పేరుంది. దీంతో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలని హీరో నాగార్జున నిర్ణయించారు. 
 
ఇప్పటికే వీరిద్దరిపై ఫోటో షూట్ కూడా పూర్తయినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసన్న కుమార్‌ను ఈ చిత్రం ద్వారా నాగార్జున దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. కథ, స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. 
 
 
About Writer
వరుణ్