శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (10:17 IST)

అంగరంగ వైభవంగా పూజా హెగ్డే సోదరుడి వివాహం

pooja hegde
ప్రముఖ నటి పూజా హెగ్డే సోదరుడు రిషభ్ హెగ్డే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శివానీ శెట్టి అనే యువతిని రిషభ్ హగ్డే వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని పూజా హెగ్డే వెల్లడించారు. అలాగే, పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా వెల్లడించారు. 
 
తన సోదరుడి పెళ్లి వేడుక ప్రారంభమైనప్పటి నుంచి ఎపుడూ లేనంత సంతోషంగా ఉన్నానని పూజా హెగ్డే వెల్లడించారు. చిన్నపిల్లలా నవ్వేశాననీ, ఆనంద భాష్పాలు రాల్చానని చెప్పారు. కాగా, ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.