బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (15:46 IST)

మహేష్‌ బాబు 28 సినిమా జనవరి నుంచి కంటెన్యూ

Mahesh Babu, Trivikram  Thaman, Radhakrishna, Surya Devara Nagavamshi
Mahesh Babu, Trivikram Thaman, Radhakrishna, Surya Devara Nagavamshi
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 28వ సినిమా గురించి చిత్ర నిర్మాత నాగవంశీ తెలియజేశాడు. ఈ చిత్ర నిర్మాతలు సహా దర్శకుడు త్రివిక్రమ్‌, మహేష్‌ తో కలిసి క్రిస్మస్‌ సెలెబ్రేషన్స్‌ లో పాల్గొన్న ఫోటోలు కొన్ని బయటకి విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగవంశీ తెలుపుతూ, సినిమా కొత్త షెడ్యూల్‌ జనవరి నుంచే స్టార్ట్‌ చేయబోతున్నాం. ఏకధాటిగా షూటింగ్‌ జరుపుకుంటుందని తెలిపారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, థమన్‌, మహేష్‌బాబు, రాధాకృష్ణ, నాగవంశీలున్న ఫొటోను టిట్టర్‌లో పోస్ట్‌ చేశారు. హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్‌ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మాణం వహిస్తున్నారు.
 
పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న చిత్రం దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన సంభాషణలతోపాటు, కథాపరంగా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ ని కంప్లీట్‌ చేసుకోగా ఇప్పుడు రెండో షెడ్యూల్‌ మొదలుపెట్టబోతున్నారు. ఇందులో పాత్ర కోసం మహేష్‌ తన బాడీని కొంత మార్చుకుంటున్నారు.