బాయ్ ఫ్రెండ్‌తో అందుకు ఒప్పేసుకున్న నయనతార...
నయనతార ప్రస్తుతం రజినీకాంత్ సరసన దర్బార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతోందా...? ఈ ప్రశ్నకు నయనతార కాకుండా ఆమె బాయ్ ఫ్రెండే సమాధానమిచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్, ప్రభాస్ పెళ్ళిళ్లు ఎప్పుడు జరుగుతాయంటూ వచ్చిన వార్తలు మరెవ్వరి విషయంలో రాలేదు. ఆ తరువాత ఆ రేంజ్ చర్చ జరిగింది నయనతార పెళ్ళి గురించే. గత రెండుమూడేళ్ళుగా నయనతార పెళ్ళి డేట్ ఇదే అంటూ అనేక పుకార్లు, షికార్లు చేశాయి. కానీ ఇప్పటివరకు ఆమె పెళ్ళి చేసుకోలేదు.
నయనతార, ప్రభుదేవాలు పెళ్ళి చేసుకోవాలని పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ప్రభుదేవా హ్యాండ్ ఇచ్చాడు. చాన్నాళ్ళు నయనతార ఆ షాక్‌లోనే ఉండిపోయింది. మూడేళ్ళ క్రితం విఘ్నేష్ శివంతో ప్రేమలో పడింది. అప్పటి నుంచి వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. విఘ్నేష్ శివంతో తన అనుబంధం గురించి మొదట్లో పెదవి విప్పలేదు నయనతార. కానీ గత యేడాది నుంచి మాత్రం ఆమె తన రిలేషన్‌ను దాచుకోలేదు.
ఇద్దరూ కలిసి అనేక ప్లేస్‌లకు టూర్లు వేశారు. సినిమా ఫంక్షన్లకు కలిసే వెళుతున్నారు. ఎక్కడికైనా వీరి గురించి రహస్యమేమీ లేదు. వీరిద్దరికీ ఇప్పటికే సీక్రెట్ నిశ్చితార్థం జరిగిందని ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు. తాజాగా నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ ఒక హింట్ ఇచ్చాడు. ఈ యేడాది తన పెళ్ళి గ్యారంటీగా జరుగుతుందన్నట్లుగా మాట్లాడాడు. అంటే నయనతార, విఘ్నేష్‌ల పెళ్ళి త్వరలో జరుగనుందన్నమాట. కానీ సల్మాన్ ఖాన్, ప్రభాస్‌ల గురించి మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. నయనతార పెళ్ళి పుకార్లకు మాత్రం త్వరలోనే ఎండ్ కార్డు పడేట్లుగా ఉంది.