నేనేందుకు నయనతారకు క్షమాపణలు చెప్పాలి..? అది నా రక్తంలో లేదు.. రాధారవి
దక్షిణాది సూపర్ స్టార్ నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. వార్తల్లోకెక్కిన ప్రముఖ తమిళ నటుడు రాధారవి.. మళ్లీ ఈ వివాదంపై కామెంట్లు చేశాడు. నయనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తానెందుకు క్షమాపణలు చెప్పాలన్నాడు. తానేమైనా క్షమించరాని నేరం చేశానా.. తానెందుకు నయనకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించాడు. తాను తప్పుగా మాట్లాడి వుంటే ప్రేక్షకులు ఎందుకు తప్పట్లు కొట్టారు.
తాను తప్పుగా మాట్లాడి వుంటే ఆ మాటలను వెనక్కి తీసుకుంటానని గతంలో చెప్పాను. తానీ తానెప్పుడూ ఎవ్వరికీ క్షమాపణలు చెప్పలేదు. అలా క్షమాపణలు చెప్పే అలవాటు తన రక్తంలోనే లేదని చెప్పాడు. నయనతార గురించి మాట్లాడినప్పుడు చాలామంది తప్పట్లు కొట్టి అభినందించారు.
నిజం మాట్లాడితే ప్రజలు మద్దతు పలుకుతారు. అయినా తానెందుకు భయపడాలి అని రాధారవి మండిపడ్డారు. తాను చేసిన వ్యాఖ్యల్లో నిజముంటే నమ్మండి.. లేదంటారా వదిలేయండి.. అంతేకానీ రాద్దాంతం ఎందుకు చేస్తారని రాధారవి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.