శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:15 IST)

నాకంటే నాలుగేళ్లు చిన్నవాడు... శృంగారంలో పాల్గొంటే చిన్నదాన్నైపోతానా?

కెరీర్, ఉద్యోగం తదితర ఇతర కుటుంబ సమస్యలతో నా పెళ్లి ఆలస్యమైంది. నేను ఉద్యోగం చేసే కంపెనీలో పని చేసే ఓ యువకుడు నేనంటే ఇష్టం అంటున్నాడు. కాకపోతే నాకంటే అతడు నాలుగేళ్లు చిన్నవాడు. ప్రస్తుతం నా వయసు 28 ఏళ్లు. ఐతే నాకంటే చిన్నవాడిని పెళ్లాడితే పరిస్థితి ఎలా అని ఆలోచనలో పడ్డాను.
 
ఐతే నా స్నేహితురాలు శృంగారం గురించి చాలా విషయాలు చెపుతుంటుంది. ఈమధ్య ఓ విషయం చెప్పింది. తక్కువ వయసున్న పురుషుడితో ఎక్కువ వయసు కల స్త్రీ శృంగారంలో పాల్గొంటే ఆమె యవ్వనవతిగా మారుతుందనీ, చాలా అందంగా తయారవుతుందని, వయసు కూడా తక్కువగా కనబడుతుందని అంటోంది. ఇది నిజమా...?
 
ఇది అపోహ. అందులో వాస్తవం లేదు. శృంగారంలో పాల్గొనడం వల్ల నూతనోత్సాహం కలుగుతుంది. ఆరోగ్యకరమైన శృంగారం అన్నివిధాలా మేలు చేకూరుస్తుంది. అంతేతప్ప ఇలా తక్కువ ఎక్కువ వయసుల వల్ల మనిషి అందంలో తేడాలు ఏమీ కనబడవు. ఐతే వయసు తేడాలతో చాలామంది వివాహం చేస్కున్న దాఖలాలు వున్నాయి. వాళ్లంతా హ్యాపీగానే తమ వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. మీ విషయంలో కూడా అతడు అన్నివిధాలా మంచివాడు అని అనుకుంటే హాయిగా పెళ్లి చేసుకోండి.