1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Opening day report for 'Naga Bandham' and 'Rao Bahadur'

ఫస్ట్ డే నాగ బంధం, రావు బహదూర్ ఓపెనింగ్స్ రిపోర్ట్

Naga Bandham' and 'Rao Bahadur'
Naga Bandham' and 'Rao Bahadur'
ఈరోజు శుక్రవారంనాడు విడుదలైన తెలుగు సినిమాల రిపోర్ట్ ను ట్రేడ్ వర్గాలు ఎనలైజ్ చేశాయి. ఎగ్జిబిటర్ల రిపోర్ట్ ప్రకారం.. హీరో సత్యదేవ్  నటించిన  రావు బహదూర్, విరాట్ కర్ణ నటించిన నాగ బంధం  సినిమాలు గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి రెండు సినిమాల్లో నాగ బంధం మూవీ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిందని దర్శకుడు అబిషేక్ నామా తెలియజేశాడు.
 
అదేవిధంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కగా రావు బహదూర్ ని మహేష్ బాబు ప్రజెంట్ చేయడంతో బజ్ పెరిగిపోయింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇండియాలో నాగ బంధం మూవీ 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా…రావు బహదూర్ మూవీ… 60 లక్షల రేంజ్ లో బుకింగ్స్ ను అందుకుంది. కానీ అదే టైంలో ఓవర్సీస్ లో రావు బహదూర్ మూవీ మంచి లీడ్ ను చూపించింది. ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా ఇండియాలో నాగ బంధం మూవీ మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…
 
ఓవర్సీస్ లో రావు బహదూర్ మంచి లీడ్ ను చూపెడుతుంది. దాంతో ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…రావు బహదూర్ మూవీ 80 లక్షల రేంజ్ నుండి..
 
కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రావు బహదూర్ మూవీ 1.6-1.8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను…
 
సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇక నాగ బంధం మూవీ రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది. ఇక రెండు సినిమాలు అఫీషియల్ గా ఈ రోజు అంచనాలను ఎంతవరకు మించిపోతాయో చూడాలి. 
 
ఎందుకంటే ఇప్పటికే నాగబంధం సినిమా రిచెనెస్ కనిపించినా సామాన్యుడి ఎంత మేర ఆకట్టుకుంటుందో అేనుమానంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రావుబహదూర్ కూడా ఇంచుమించు అలానే వుంది. ఇక జూలై 10 వరకు పెద్ద సినిమా ఏమీ లేదుగనుక ఈలోగా ఆ రెండు సినిమాకు లాభిస్తోందో లేదో చూడాలి.
About Writer
దేవీ