సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డివి
Last Modified: శనివారం, 16 జనవరి 2021 (17:00 IST)

బాత్ టబ్‌లో సబ్బు నురగతో ప‌వ‌న్ నాయిక‌ ప్రణీత, ఆమెను అలా చూడగలరా?

న‌టిగా ప‌లు చిత్రాల్లో న‌టించినా స‌రైన అవ‌కాశాలు కంటెన్యూగా రాక‌పోవ‌డంతో చాలామంది గ్యాప్ తీసుకుంటారు. అలాంటి కోవ‌లోనే ప్ర‌ణీత చేరింది. పవర్ స్టార్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్‌గా నటించిన కన్నడ భామ ప్రణీత సుభాష్‌కు ఆ సినిమా తరువాత టాలీవుడ్లో వరుస అవకాశాలతో జోరు చూపిస్తుందని భావించారు.
 
కానీ పరిస్థితి దానికి భిన్నంగా మారింది. ఆ సినిమా తరువాత పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో మళ్ళీ కన్నడంలోనే ప్రయత్నాలు చేసిన లాభం లేకపోయిందో ఏమో, ఆ త‌ర్వాత తాను ట‌బ్‌ లో‌కి దిగిన మూడేళ్ళ‌నాటి ఫొటోలు ఇప్పుడు పోస్ట్ చేసింది. కానీ పెద్ద‌గా లాభంలేదు. అయితే ఈసారి ఏకంగా పైన ఎలాంటి అచ్చాద‌నం లేకుండా స‌బ్బుతో నుర‌క పెట్టుకుని మ‌రీ క్రేజ్ కోసం ప్ర‌య‌త్నించింది.
 
తాజాగా ఓ బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది.. ప్రణీత. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇవ‌న్నీ సినిమా నాయిక‌ల‌కు మామూలే అయినా.. ఆమెను సెక్సీగా చూడ‌టం ప్రేక్ష‌కుల‌కు ఇష్ట‌మేనా.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈసారి ఎలాంటి అవ‌కాశాలు తెచ్చిపెడుతుందో చూద్దాం.