గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (20:15 IST)

ముగ్గురు హీరోయిన్లపై ముచ్చటపడిన జూనియర్ ఎన్టీఆర్ (video)

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు హీరోయిన్లపై ముచ్చటపడ్డారు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్'' మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం. 
 
ఈ సినిమాకు 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 
 
వచ్చే ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానులకు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. రాజ‌కీయం నేప‌థ్యంతో తెర‌కెక్క‌నున్న ఎన్టీఆర్ 30వ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ సీనియర్ నటుడు జయరామ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. 
 
అయితే, ఇక క‌థ ఆధారంగా ముగ్గురు హీరోయిన్స్‌ని ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని, ఇందులో ఒక హీరోయిన్‌గా జాన్వీ క‌పూర్‌ని సెల‌క్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. మిగిలిన ఇద్దరు హీరోయిన్లను ఖరారు చేసే పనిలో దర్శకనిర్మాతలు ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ మూవీపై పూర్తి వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.