శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:37 IST)

క్రేజ్ ఉన్నా ఛాన్సులు నిల్ :: ప్లీజ్... ఒక్క ఛాన్స్ అంటున్న హీరోయిన్లు...

ఒకపుడు ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్లు.. ఇపుడు ఒక్క ఛాన్స్ అంటూ దర్శక నిర్మాతల వెంటపడుతున్నారు. ఒకే ఒక్క చిత్రంతో తారా స్థాయికి చేరిన హీరోయిన్లలో చెప్పుకోదగిన వారిలో రెజీనా కెసాండ్రా, ప్రణీత, పాయల్ రాజ్‌పుత్ వంటి వారు ఉన్నారు. వీరు నటించిన పలు చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ సాధించాయి. ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో ఈ ముద్దుగుమ్మలు కనుమరుగయ్యారు. హీరోయిన్ ఛాన్సులు లేకపోవడంతో ఐటమ్ నంబర్స్, స్పెషల్ సాంగ్స్‌‌తో మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద బిజీ అవుతున్నారు. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' వంటి కొన్ని సినిమాల్లో చేసిన ప్రణీత.. రవితేజ "ఖిలాడీ" సినిమాలో ఐటమ నంబర్ చేయబోతోందని, దాంతో టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవ్వడానికి ట్రై చేస్తోందని టాక్ నడుస్తోంది.
 
ఇకపోతే, మెగా హీరో సాయితేజ్‌తో ప్రేమలోపడినట్టు గుసగుసలు వినిపించిన హీరోయిన్ రెజీనా. ఈమెకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేక మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తోంది. ఒకటి, రెండు సినిమాలు చేస్తున్నా కూడా అవేం పెద్ద సినిమాలు కాదు. అందుకే మళ్లీ మంచి కమ్ బ్యాక్ కోసం క్రేజీ స్పెషల్ సాంగ్‌కి సై అంటోంది. ఇందులోభాగంగా, కొరటాల - చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న "ఆచార్య" సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 
 
ఇకపోతే, "ఆర్ఎక్స్ 100" మూవీతో రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్ కూడా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుందనుకున్నారు. కానీ, ఆమె కెరీర్ అలా సాగడం లేదు. సరైన ఛాన్సు లేకపోవడంతో తీవ్ర నిరాశకులోనైంది. 
 
పైగా, ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి లేదు. దీంతో ఓటీటీలో విడుదల చేసుకుంటూ సాగిపోతోంది. ఇప్పుడు మళ్లీ మంచి కమ్ బ్యాక్ కోసం "ఆర్‌ఎక్స్ 100" డైరెక్టర్ సెకండ్ మూవీ "మహాసముద్రం"లో స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు.. మరికొంతమంది హీరోయిన్లు తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.