శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (21:51 IST)

ప్రముఖ సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరారు నర్సింగ్‌ యాదవ్‌. ఆయన పూర్తి పేరు  
మైలా నర‌సింహ యాద‌వ్‌. ఇండ‌స్ట్రీలో అంద‌రూ న‌ర‌సింగ్ యాద‌వ్ అని పిలుస్తారు.
 
1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించిన ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు.
300కు పైగా సినిమాల్లో న‌టించి కామెడీ విల‌న్‌గా, విల‌క్ష‌ణ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 
తెలుగు, హిందీ, త‌మిళ్‌ భాషా చిత్రాల్లో న‌టించారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషాలోనూ మంచి కేర‌క్ట‌ర్ చేశారు.
 
విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన హేమాహేమీలతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమయ్యారు. క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌ జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన కేర‌క్ట‌ర్ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది.
 
ఇటీవ‌ల చిరంజీవి రీ-ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150లోనూ న‌టించారు. గ‌త కొంత‌కాలంగా ఆయనకు డ‌యాలిసిస్ జ‌రుగుతోంది. ఐతే గురువారం పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.