గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (14:00 IST)

ఎన్టీఆర్ హోస్ట్‌గా కొత్త షో.. రూ.18 కోట్లు తీసుకోబోతున్నాడట..!? (video)

బిగ్ బాస్ తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా 60 ఎపిసోడ్ల పాటు జరగబోయే ఈ షోలో ప్రతి ఎపిసోడ్‌కు ఎన్టీఆర్‌కు రూ.30 లక్షలు వేతనం ఇస్తున్నారు. దీంతో మొత్తం షో కోసం రూ.18 కోట్లు తీసుకోబోతున్నాడు. తెలుగు బుల్లితెర మీద ఎవరైనా నటుడు అందుకుంటున్న పారితోషికం కంటే ఇది ఎన్నో రేట్లు ఎక్కువ అని సినీ పండితులు అంటున్నారు. 
 
ఇకపోతే.. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ పూర్తి చేసి తారక్ ఈ షోకు షూట్ చేయనున్నారు. కాబట్టి త్రివిక్రమ్ చిత్రం కొంత మేర ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. రాజమౌళి యొక్క ఆర్ఆర్ఆర్‌లో తెలంగాణ గిరిజన యోధుడు, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే అతని పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలయ్యింది.
 
ఈ చిత్రం 2021 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది, కాని కరోనావైరస్ పాండమిక్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఇదంతా ఎలా ఉన్నా ఈ షో కారణంగా త్రివిక్రమ్ ఇబ్బంది పడవచ్చు. సంక్రాంతి నాటికి ఆయన గత సినిమా అల వైకుంఠపురంలో విడుదలయ్యి ఏడాది అయిపోతుంది. దీని కారణంగా తన తదుపరి చిత్రం సెట్స్ మీదకు వెళ్ళడానికే టైం పట్టే అవకాశం ఉంది.