శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 డిశెంబరు 2020 (11:43 IST)

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలె, అతిథిగా మహేష్ బాబు? చిందేయనున్న బ్యూటీలు

బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ ముగింపుకు వచ్చేసింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలె ఆదివారం నాడు జరుగబోతోంది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ లేదా చిరంజీవి అంటున్నారు కానీ బిగ్ బాస్ ఏం చేస్తాడో ఎవ్వరికీ చెప్పడు. గుట్టుచప్పుడు కాకుండా ప్రిన్స్ మహేష్ బాబును పిలుచుకు రానున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే గ్రాండ్ ఫినాలే ఏం రేంజిలో వుంటుందో వేరే చెప్పక్కర్లేదు.
 
ఇకపోతే ఈ కార్యక్రమం మరింత గ్లామర్‌గా వుండేందుకు రాయ్ లక్ష్మి లేదంటే మెహరీన్ వస్తారని తెలుస్తోంది. ముగింపు వేడుకలో డ్యాన్స్ చేయబోతున్న ఈ నటీమణులకు గ్రాండ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసారని సమాచారం.
ఇకపోతే ఈ సీజన్ విజేతగా అభిజిత్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అద్భుతం జరిగితే అరియానా కావచ్చు, సోహెల్ అందుకోవచ్చు, అఖిల్ సెలెక్ట్ కావచ్చు. మరి బిగ్ బాస్ కు ఎవరికి పట్టం కడతారో వచ్చే ఆదివారం నాడు చూద్దాం.