మోనాల్‌కి ఛాన్సిచ్చి.. అందరి మనస్సుల్ని గెలుచుకుంది.. టైటిల్ రేసులో..?

Ariyana_Monal
Ariyana_Monal
సెల్వి| Last Updated: శనివారం, 12 డిశెంబరు 2020 (13:23 IST)
బిగ్ బాస్ హౌస్‌లో టాప్ - 5 లోకి వెళ్లే ఆఖరి వారం గేమ్ ఆసక్తికరంగా మారింది. అఖిల్ తప్ప మిగతా హౌస్ మేట్స్ అందర్నీ నామినేట్ చేశాడు బిగ్ బాస్. అంతేకాదు, ఈ జెర్నీలో హౌస్ మేట్స్ ప్రజలతో నేరుగా తమకి ఓటింగ్ చేసుకోమని రిక్వస్ట్ చేసుకునే అవకాశం ఈవారం ఉందని చెప్పి టాస్క్‌లని కూడా డిజైన్ చేశాడు. దీనికోసం నాలుగు టాస్క్‌లు ఇచ్చాడు. ఇందులో రెండుసార్లు అరియానా ఓటింగ్ రిక్వస్ట్ చేసుకుంటే, ఒక్కసారి సోహైల్, మరోసారి మోనాల్‌కి అవకాశం దక్కింది.

నిజానికి మోనాల్‌కి ఈ అవకాశం ఇచ్చింది హారికే. అంతేకాదు, హారిక మోనాల్‌కి ఈ అవకాశం ఇస్తూ, కెప్టెన్సీ టాస్క్ అప్పుడు నన్ను ఎత్తుకుని మోసావ్ నన్ను కెప్టెన్‌ని చేశావ్, అప్పుడు నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. అందుకే పే ఆఫ్ గా నీకు ఇది ఇచ్చేస్తున్నా అంటూ మాట్లాడింది. ఇక్కడే హారిక ఎంత డీప్‌గా ఆలోచిస్తుందో తెలుస్తోంది. హారిక స్మార్ట్ గేమ్‌కి నెటిజన్స్ సూపరో సూపర్ అంటున్నారు.

అరియానా ఆర్గ్యూపెట్టుకుని అభిజిత్ దిగిపోడానికి కారణం అయితే, హారిక గెలిచే అవకాశం ఉన్నా కూడా మోనాల్ కి ఈ అవకాశాన్ని ఇచ్చేసింది. ఇక్కడే ప్రజల హృదయాలని గెలుచుకుంది హారిక. ఈవారం ఖచ్చితంగా సేఫ్ జోన్ లోనే ఉంది కాబట్టి టాప్ - 5 కి కచ్చితంగా వెళ్తుంది.దీనిపై మరింత చదవండి :