సమంత ప్రభు భారీ కటౌట్ పెట్టినా ఫలితం శూన్యమేనా!
Samanthaprabhu2
బాహుబలి విడుదల తర్వాత దర్శక నిర్మాత గుణశేఖర్ తీసిన రుద్రమదేవి అబాసుపాలైంది. అందులోనూ సాంకేతిక అధునాతనంగా చూపారు. కానీ ఫలితంలేదు. ఆ సినిమా ఆయనకు నష్టాలు తెచ్చిపెట్టింది. అయినా మొక్కవోని దీక్షతో మరలా సంవత్సరాలు గేప్తీసుకుని శాకుంతలం తీశాడు. కథకంటే విఎఫ్ఎక్స్పైనే ఆధారపడిన గుణశేఖర్‌కు మొదటి రోజే థియేటర్లో సందడిలేకుండా పోవడం విశేషం. ఆర్.ఆర్.ఆర్.టీమ్‌తోనే గ్రాఫిక్స్ పనులన్నీ చేశానని చెప్పినా దుష్యంతునితో రాక్షసులు వార్ అనేది పెద్ద ఎట్రాక్ట్ కలిగించలేదు. ఇక పిల్లలు కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఫోన్లలోనే గ్రాఫిక్స్ సినిమాలు చూస్తుంటే అంతకుమించి వుంటేనే శాకుంతలం సినిమా చూస్తారనే టాక్ ప్రబలంగా వినిపిస్తోంది. మొత్తంగా కటౌట్లు, ప్రింటింగ్ ఖర్చులు కూడా వస్తాయో రావోనని సందేహం అయితే కనిపిస్తుంది.

