సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:09 IST)

సమంతకు మరలా అనారోగ్యం, అందుకే ఢిల్లీ వెళ్లడంలేదు

Samantha
Samantha
నటి సమంతకు ఆరోగ్యం సహరించడంలేదని తెలిసిందే. అయినా ఈమధ్య కోలుకొని జిమ్‌లో కష్టపడుతూ కొన్ని ఫొటోలు పెడుతూ పోస్ట్‌ చేసింది. ఆ తర్వాత గుణశేఖర్‌, దిల్‌ రాజు కోరిక మేరకు శాకుంతలం సినిమా ప్రమోషన్‌కు హాజరైంది. కొద్దిరోజులు ప్రమోషన్‌లో పాల్గొంది. ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగతాన్ని కూడా అడిగితే కాస్త ఎమోషన్‌ కూడా అయింది.
 
కాగా, గత వారం రోజులుగా శాకుంతలం సినిమా ప్రివ్యూ పలు చోట్ల వేస్తున్నారు. ఆంధ్ర,తెలంగాణతోపాటు ఢల్లీిలో కూడా కొందరు ప్రముఖులకు ప్రదర్శిస్తున్నారు. ఇలా వేయడం వల్ల కొన్ని చిన్నచిన్న లోపాలుంటే వాటిని సరిచేసుకుని గుణశేఖర్‌ దిద్దుకుంటున్నారు.అలా దిద్దిన కాపీని ఈరోజు ప్రత్యేకంగా డిల్లీలో బిజెపి నాయకులకు చూపించనున్నారు.
 
ఈ ప్రదర్శకు సమంతకూడా వస్తుందని బిజెపి వారు అనుకున్నారు. కానీ ఆమెకు మరలా ఆరోగ్యంబాగోలేదని అందుకే తాను రాకపోవచ్చని గుణశేఖర్‌ క్లారిటీ ఇచ్చారు. ఆమె వస్తే ఢిల్లీలోని ప్రివ్యూ బాగా జరిగేదనీ మాకు అనిపిస్తుందని చెబుతూ, నడ్డా వంటి నాయకులు వస్తారని దర్శక నిర్మాత గుణశేఖర్‌ తెలిపారు. 
 
సమంతకు అసలేం జరిగింది అంటే, ఆమెకు తరచూ దగ్గు వస్తుందనీ డాక్టర్లు రెస్ట్‌తీసుకోవాలని సూచించారని తెలిపారు. ఇప్పటికే తన ఆరోగ్యం గురించి సమంత చెబుతూ, నాకు వచ్చిన వ్యాధితో ఒక్కోసారి నాకు కళ్ళు సరిగ్గాకనపడకపోవడం జరుగుతుందని నిర్మొహమాటంగా చెప్పింది. సో.. మరలా కోలుకొని యాక్టివ్‌గా సినిమాలు చేయాలని వెబ్‌దునియా ఆకాంక్షిస్తోంది.