శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:01 IST)

శాకుంతలం ఇప్పటి జనరేషన్‌ చూస్తారా! లేదా! గుణశేఖర్‌ ఏమన్నాడంటే!

Gunasekhar
Gunasekhar
సమంత నటించిన శాకుంతలం సినిమా పురాణాల్లోంచి తీసుకున్న కథ. కాళిదాసు రచించిన శాకుంతలోపాఖ్యానం లోనిది. మరి ఇప్పటి జనరేషన్‌ ఇటువంటి కథను చూస్తారా! అనే డౌట్‌ అందరినీలోనూ నెలకొంది. ఇదేవిషయాన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన గుణశేఖర్‌ ఏమన్నారంటే... శకుంతల, దుష్యంతుల కథ ఎన్‌.టి.ఆర్‌.గారు అప్పట్లో చేశారు. ఆ తర్వాత మరో సినిమా కూడా వచ్చింది. ఇక బెంగాల్‌లోనూ, తమిళంలోనూ ఆమధ్య వచ్చాయి.
 
మరి అందులోలేనిది ఇందులో ఏముంది? అన్న ప్రశ్నకు గుణశేఖర్‌ సమాధానమిస్తూ.. శాంకుతల కథలో రెండు కోణాలున్నాయి. శృంగార శాకుంతల, ఆత్మాభిమానం వున్న శాకుంతల ఈ రెండో కోణాన్ని నేను ఆవిష్కరించాను. శృంగార శాకుంతలగా సమంతను చూపించలేను. ఎందుకంటే ఆమె ఆహార్యం అందుకు సరిపడదు. అలా చేసినా ఎవరూ చూడదరు. సమంతకు తగినట్లు ఆత్మాభిమానం గల అమ్మాయిగా ఇందులో చూపించాను. ఈ కోణం ఇంతవరకు ఎవరూ టచ్‌చేయలేదు. అని వివరించారు. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ 3డి ఫార్మెట్‌. దీని ద్వారా కుటుంబప్రేక్షకులు వస్తారని ఆయన ఆశిస్తున్నారు. మరి ఈనెల 14న విడుదలకాబోతున్న సినిమా ఏ మేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.