సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (10:49 IST)

రకుల్‌ను తెలుగు పరిశ్రమ పట్టించుకోలేక పోవడానికి కారణం అదేనా!

rakul with pet
rakul with pet
తెలుగు సినిమారంగంలో ఒక వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు ఏవో చిన్న చిన్న వ్యాపార ప్రకటనలు చేసుకుంటుంది. ఆమధ్య లేటెస్ట్‌ ఫొటో షూట్‌ను జరుపుకుంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని భావించింది. కానీ హీరోలంతా పరభాషలో కొత్తగా వెలుగులోకి వస్తున్న హీరోయిన్లను కావాలని అడగడంతో పాపం రకుల్‌ ప్రీత్‌ కు చుక్కెదురైంది. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో మొదట్లో ఓ రోల్‌ కోసం అనుకున్నారట. కానీ ఎందుకనే ఆ తర్వాత వద్దనుకున్నట్లు వార్తలు వచ్చాయి.
 
Raku l atest
Raku l atest
ఇప్పుడు తాజాగా పెట్‌ ఫుడ్‌ కోసం ఓ యాడ్‌ చేసింది. పెడ్‌ పేరెంట్స్‌ నేను నా పెట్‌కు మంచి ఫుడ్‌ ఇస్తున్నాను. అందుకు నేను ఫైనల్‌గా ఫార్‌లిక్స్‌ అనే ఫుడ్‌ ఇస్తున్నట్లు చెప్పింది. అందుకు కారణాలు కూడా తెలిపింది. పిల్లల్ని ఎలా ముద్దుగా పెంచుకుంటామో పెట్స్‌నుకూడా అంతే ముద్దుగా పెంచుకుంటాం. మనకు మైడ్‌ రిలీఫ్‌గా వుంటుందని చెబుతోంది.
 
గతంలో తెలుగులో కెరీర్‌ హవా బాగున్నదశలో హైదరాబాద్‌లో జిమ్‌ను కూడా ఆమె నెలకొల్పింది. స్వంత ఇల్లుకూడా ఇక్కడ వుంది. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాలవల్ల ఆమె కెరీర్‌ డౌన్‌ ఫాల్‌ అయిందని టాక్‌ కూడా టాలీవుడ్‌లో వినిపించింది.