శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (22:33 IST)

సమంత రెండో పెళ్లికి రెడీ అయ్యిందా.. సద్గురు ఒప్పించారట! (video)

samantha
స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. సమంత రెండో పెళ్లి దాదాపు ఖాయమయ్యిందని, ఆమె ఆధ్యాత్మిక గురువు సద్గురు ఇప్పటికే సామ్‌ను రెండో పెళ్లికి ఒప్పించాడంటూ ఇండస్ట్రీలో  వార్తలు గుప్పుమన్నాయి. 
 
నాగచైతన్యతో విడాకుల అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లానని స్వయంగా చెప్పిన సామ్‌ దాన్నుంచి బయటపడేందుకు తరుచూ వెకేషన్స్‌ను చుట్టేస్తుంది. అయినప్పటికీ గత జ్ఞాపకాల నుంచి సమంత బయటపడలేకపోతుందట. 
 
దీంతో ఆమె బాధను గమనించిన సద్గురు ఎట్టకేలకు సామ్‌ను రెండో పెళ్లి ఒప్పించాడట. ఆయనే ఒకే చేసిన అబ్బాయినే సమంత త్వరలో పెళ్లిచేసుకోబోతుందంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే మరోసారి ప్రేమలో పడే ఛాన్సే లేదని చెప్పిన సమంత నిజంగానే రెండో పెళ్లి చేసుకోనుందా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.