అబ్బా.. రానాతో సమ్మూ రొమాన్స్ పండించిందే.. బెంగళూరు డేస్ రీమేక్‌లో.. ఫోటో చూడండి..
బాహుబలి విలన్ భల్లాలదేవుడు రానాతో సమంత రొమాన్స్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియా చర్చ సాగుతోంది. అక్కినేని నాగచైతన్యతో సమ్మూకు పెళ్లి కుదిరినే నేపథ్యంలో.. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని సమంత
బాహుబలి విలన్ భల్లాలదేవుడు రానాతో సమంత రొమాన్స్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియా చర్చ సాగుతోంది. అక్కినేని నాగచైతన్యతో సమ్మూకు పెళ్లి కుదిరినే నేపథ్యంలో.. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని సమంత చెప్పడంతో ఫ్యాన్సంతా హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ నేపథ్యంలో.. రానాతో ఛాంగుభళా అంటోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన బెంగుళూరు డేస్ తమిళ రీ-మేక్‌లో సమ్మూ, రానాల రొమాన్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
మోలీవుడ్‌లో నిత్యామీనన్ చేసిన స్పెషల్ రోల్‌ని మించిపోయినట్టుగా సమంత నటించింది. ఈ వీడియో సోషల్ వెబ్ సైట్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. కాగా నాగచైతన్య-సమంతల లవ్వాయణం గురించి తండ్రి అక్కినేని నాగార్జున కంటే ముందుగా రానాకే తెలుసునని చైతూ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమ్మూ-చైతూల లవ్వాయణం తెలిసిన రానాతో సమంత రొమాన్స్‌ను అద్భుతంగా పండించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.