శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:54 IST)

వచ్చే యేడాది చైతూ - శ్యామ్ వివాహం... అమలలా స్థిరపడిపోతుందా

ఈమధ్య సినిమాల సెన్సేషన్ కన్నా సోషల్ మీడియా సెన్సేషన్ ఎక్కువై పోయింది. సినిమా సెలెబ్రిటీస్‌కు ట్విటర్ ఒక పెద్ద ప్లాట్ ఫాంగా మారిపోయింది. ఏది చెప్పాలన్నా సోషల్ మీడియానే బెస్ట్ రిసోర్స్ అయింది. స్టార్ డమ

ఈ మధ్య సినిమాల సెన్సేషన్ కన్నా సోషల్ మీడియా సెన్సేషన్ ఎక్కువై పోయింది. సినిమా సెలెబ్రిటీస్‌కు ట్విటర్ ఒక పెద్ద ప్లాట్ ఫాంగా మారిపోయింది. ఏది చెప్పాలన్నా సోషల్ మీడియానే బెస్ట్ రిసోర్స్ అయింది. స్టార్ డమ్ ఉన్న నటీనటులు, డైరెక్టర్లూ దీన్ని తమ పర్సనల్ మేటర్స్ చెప్పుకునేందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్‌గా సమంత కూడా తన వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేసి అందర్నీ ఆశ్చర్యంలో పడేలా చేసింది.

సమంత టైం దొరికినప్పుడల్లా ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాన్స్‌తో మాట్లాడ్డం ఆమెకు హాబీ. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇస్తుంది. కొందరు సినీ ప్రముఖులు తమ పర్సనల్ సెక్రెటరీలతో ఫ్యాన్స్ ప్రశ్నలకు జవాబులిప్పిస్తుంటారు. 
 
కానీ, స్వయంగా జవాబివ్వడం సమంత స్పెషాలిటీ అంటారు. మరోపక్క తన జీవితాన్ని ఇలా గడపాలి అంటూ ముందే లెక్కలు వేసుకోవడం నాకు నచ్చదు. ఆరోజుని నిజంగానే ఆస్వాదించాలంటే మనసులో ఎలాంటి ప్రణాళికలూ ఉండకూడదు. అది పెళ్లి అయినా, పుట్టిన రోజు అయినా.. అంటూ తన మనసులోని మాటను చెప్పింది. జీవితంలోని ప్రత్యేకమైన సందర్భాల్ని ఎలా జరుపుకోవడం ఇష్టం? అని సమంతని అడిగితే ''పుట్టినరోజు, పండగ రోజు కంటే ప్రత్యేకం ఏముంటాయి? అయితే నాకు నా పుట్టినరోజు జరుపుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ఏం సాధించామని ఇంత హడావుడి? అనిపిస్తుంది. 
 
ఈరోజు ఇన్ని పనులు చేయాలి అనుకొంటే ఆ ఒత్తిడితో అసలేం చేయకపోవొచ్చు. నన్ను సర్‌ప్రైజ్‌ చేయాలన్న ఉద్దేశంతో స్నేహితులు, సన్నిహితులు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అవన్నీవిచిత్రంగా అనిపిస్తాయి. అదేంటో నా స్నేహితుల పుట్టిన రోజుల్ని జరపడం మాత్రం నాకు భలే సరదాగా ఉంటుంది. ఆరోజు కూడా ప్రణాళికలేం వేసుకోను. ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా'' అంది.

ఇదిలావుంటే సమ్మూ త్వరలో అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మరి పెళ్లి తర్వాత సమంత జీవితం ఎలా ఉండబోతోంది? సినిమాల్లో నటిస్తుందా? లేక పిల్లలను కనేసి అమల తరహాలో హౌస్ వైఫ్‌గా సెటిలవుతుందా? అనే సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. మరీ కుందనపు బొమ్మ ఏ రూటును ఎంచుకుంటుందో వేచి చూడాలి.