1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Shraddha Das shocking comments on Tollywood Hero's

బన్నీ క్లాస్.. తారక్ మాస్... ఇద్దరితో చేయాలని ఉంది : శ్రద్ధా దాస్

టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ల గురించి హీరోయిన్ శ్రద్ధా దాస్ తన మనసులోని మాటను వెల్లడించింది. పైగా, వారిద్దరితో నటించే అవకాశం ఏమాత్రం వచ్చినా వదులుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప

Shraddha Das
టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ల గురించి హీరోయిన్ శ్రద్ధా దాస్ తన మనసులోని మాటను వెల్లడించింది. పైగా, వారిద్దరితో నటించే అవకాశం ఏమాత్రం వచ్చినా వదులుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
 
ఇటీవలి కాలంలో ఆమెకు టాలీవుడ్ ఛాన్సులు దక్కడం లేదు. బాలీవుడ్‌లో అందాలు అరబోస్తూ బి-టౌన్‌లో హాటెస్ట్ హీరోయిన్ల జాబితాలో ఒక్కరిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోల్లో ఎవరంటే ఇష్టమనే ప్రశ్నపై ఆమె స్పందిస్తూ... తెలుగులో తాను ఎక్కువగా ఇష్టపడే హీరో అల్లు అర్జున్ అని ఆమె చెప్పింది. 'ఆర్య 2'లో తనకి ఆయన అవకాశం ఇచ్చారనీ, ఆ సినిమా తనకి ఎంతో పేరు తీసుకొచ్చిందన్నారు. 
 
ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించాలనే కోరిక చాలా కాలంగా ఉందని చెప్పింది. ఆ కల నెరవేరే సమయం కోసం ఎదురుచూస్తున్నానని అంది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'బిగ్ బాస్'లో తనకి అవకాశం వచ్చిందనీ, అయితే కొన్ని కమిట్మెంట్స్ కారణంగా తాను అంగీకరించలేకపోయానని చెప్పుకొచ్చింది. ఏదైనా వైల్డ్ కార్డ్ ద్వారా ఛాన్స్ వస్తే మాత్రం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు శ్రద్ధా దాస్ చెప్పుకొచ్చారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
విశాల్‌తో బ్రేకప్.. అందుకే పందెం కోడి-2లో వరలక్ష్మీ అలా...?