1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sravya Reddy Shocking Comments on Arjun Reddy Movie Heroine

'అర్జున్ రెడ్డి' హీరోయిన్‌ ఫేస్‌కు యుద్ధాలు చేసేంత సీన్ లేదు: నటి శ్రావ్యారెడ్డి

'అర్జున్ రెడ్డి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శాలినీ పాండేపై నటి శ్రావ్యారెడ్డి విమర్శలు గుప్పించారు. శాలినీ ఫేస్‌కు యుద్ధాలు చేసేంత సీన్ లేదంటూ మండిపడింది. విజయ్ దేవరకొండ, శాలినీ పాండే జంటగా నటించిన

Arjun Reddy Movie
'అర్జున్ రెడ్డి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శాలినీ పాండేపై నటి శ్రావ్యారెడ్డి విమర్శలు గుప్పించారు. శాలినీ ఫేస్‌కు యుద్ధాలు చేసేంత సీన్ లేదంటూ మండిపడింది. విజయ్ దేవరకొండ, శాలినీ పాండే జంటగా నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రానికి ఇంకా వివాదాలు వీడటం లేదు. 
 
కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో మొదలు బుల్లితెర బ్యూటీ అనసూయ దాకా పలువురు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నటి శ్రావ్యారెడ్డి చేరింది. తాజాగా ఆమె స్పందిస్తూ, తనకు చాలా తక్కువ సినిమాలు చూసినప్పుడు తలనొప్పి వస్తుందని, అలా తనకు తలనొప్పి తెప్పించిన చిత్రాల్లో ‘అర్జున్‌రెడ్డి’ ఒకటని చెప్పుకొచ్చింది. 
 
సినిమాతోపాటు అందులో హీరోయిన్‌గా నటించిన శాలినీ పాండేపై కూడా శ్రావ్యారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హీరోయిన్ ఫేస్‌కు యుద్ధాలు చేసేంత, డ్రగ్ అడిక్ట్ అయ్యేంత సీన్ లేదంటూ శ్రావ్యా అభిప్రాయపడింది. 'సినిమాతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండీ డైరెక్టర్ గారు? లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ చేసుకోమనా?' అంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగను ప్రశ్నించింది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన శ్వేతా బసు.. ఈసారి అతడితో...!