శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:30 IST)

అరె 'అర్జున్ రెడ్డి'లో అమ్మాయిలు పెండ్లి కాకుండానే ప్రెగ్నెంట్... వీహెచ్ ఫైర్

అర్జున్ రెడ్డి చిత్రంపై ఒకవైపు ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మాత్రం మండిపడుతున్నారు. ఆ చిత్రంపై ప్రశంసలు ఎందుకు కురిపిస్తున్నారో తేల్చుకునేందుక

అర్జున్ రెడ్డి చిత్రంపై ఒకవైపు ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మాత్రం మండిపడుతున్నారు. ఆ చిత్రంపై ప్రశంసలు ఎందుకు కురిపిస్తున్నారో తేల్చుకునేందుకు ఆయన ఇవాళ అర్జున్ రెడ్డి మార్నింగ్ షో సినిమా చూశారట. ఆ సినిమా చూస్తున్నంతసేపూ వంట్లో రక్తం సలసల మరిగిపోయిందట.
 
సినిమాలో కుర్రాళ్లు విపరీతంగా డ్రగ్స్ సేవిస్తారనీ, పైగా పెండ్లి కాకుండానే అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తారని చూసి ఆగ్రహం కట్టలు తెంచుకున్నదట. ఇలాంటి సినిమాను ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పొగడ్తలు కురిపించడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు... ఈ చిత్రాన్ని నిలుపుదల చేయాలని నగర పోలీస్ కమిషనరుకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.