శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (17:25 IST)

ఎంత చూపించమంటే అంత చూపిస్తా... ఒక్క ఛాన్స్ ఇవ్వండంటున్న తమన్నా!?

తమన్నా.. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలో ఉన్న అగ్రహీరోయిన్లలో ఒకరు. అయితే, ఈ మిల్క్ బ్యూటీ బాలీవుడ్‌లో స్థిరపడాలని తెగ ట్రై చేస్తోంది. కానీ, అదృష్టం కలిసిరావడం లేదు. లోగడ ఈ తెల్లపి

తమన్నా.. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలో ఉన్న అగ్రహీరోయిన్లలో ఒకరు. అయితే, ఈ మిల్క్ బ్యూటీ బాలీవుడ్‌లో స్థిరపడాలని తెగ ట్రై చేస్తోంది. కానీ, అదృష్టం కలిసిరావడం లేదు. లోగడ ఈ తెల్లపిల్ల నటించిన బాలీవుడ్ చిత్రం 'హిమ్మత్‌వాలా' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో ఈ అమ్మడుకి అవకాశాలు మొఖం చాటేశాయి. కానీ, తమన్నా మాత్రం బాలీవుడ్‌లో క్లిక్ అయ్యేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. 
 
ఇందుకోసం బాలీవుడ్‌కు అనుగుణంగా తన స్టైల్‌ను మార్చుకుంది. బాలీవుడ్‌లో డ్రస్సింగ్‌కు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఈ విషయాన్ని గుర్తించి క్లీవేజ్‌ షోకి బాగానే ట్రై చేస్తోంది. హెయిర్‌ స్టయిల్‌ కూడా మార్చేసింది. మొత్తానికి తనను తాను పూర్తిగా మార్చుకున్నా అవకాశాలు మాత్రం రావడం లేదని తెగ బాధపడిపోతోందట. 
 
తమన్నా లేటెస్ట్‌ ఫోటోలు చూసిన వారందరూ తమన్నా అందం అదుర్స్‌ అంటున్నారట కానీ, నువ్వే మా హీరోయిన్‌వి అనడం లేదని మథనపడిపోతోందట. అంతేకాదండోయ్... దర్శకనిర్మాతలు కోరినట్టుగా అందాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.