యాక్షన్ థ్రిల్లర్ గా S-99- మోషన్ టైటిల్ విడుదల చేసిన రమేశ్ ప్రసాద్
Ramesh Prasad, Jaganmohan, Shweta Verma, Yatish
అనంతరం రమేష్ ప్రసాద్ గారు మాట్లాడుతూ... మా నాన్నగారు సినిమాని చాలా ఇష్టపడేవారు, సినిమాల కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, అదే నన్ను ఉత్సాహపరిచింది. సినిమా కోసం పని చేయాలి అనుకున్న. అందుకోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా, ప్రపంచవ్యాప్తంగా ప్రసాద్ ల్యాబ్స్ ను నిర్మించాను. సినిమా అంటే ఒక అద్భుతం కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడటం లేదు.. కానీ సినిమాల కోసం చాలామంది కష్టపడి పని చేస్తున్నారు. S99 టైటిల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే S99 సినిమాని నిర్మించిన జగన్ గారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు టైటిల్ పోస్టర్ విడుదల చేసిన రమేశ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ S99 సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మీ ముందుకు రాబోతుందని మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు జగన్మోహన్ గారు తెలిపారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. ఇలాంటి మరిన్ని చిత్రాలని తీయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాత యతీష్ అన్నారు.

