‘అల్లూరి సీతారామరాజును గుండెల్లో పెట్టుకున్నాం’- ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
అల్లూరి సీతారామరాజును గుండెల్లో పెట్టుకున్నాం. అందుకే జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తరతరాలకు సందేశం ఇచ్చేలా జీవించిన అల్లూరిని తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోదని వ్యాఖ్యానించారు.
అల్లూరి 125 జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరం సమీపంలోని పెద అమిరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వర్చువల్‌గా సభా వేదిక నుంచే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం అల్లూరి వంశీయులను ప్రధాని నరేంద్ర మోదీ శాలువాతో సత్కరించారు.