సంబంధిత వార్తలు
- స్టేడ్ వివైడ్ అయినా అందరూ నావాళ్ళే భోళాశంకర్ టీజర్లో చిరంజీవి (video)
- చిరంజీవి భోళా శంకర్ టీజర్ డేట్ ఫిక్స్
- ఆంజనేయ స్వామిని నమ్ముకున్నాం, మంగళవారం పాపను ప్రసాదించటం అపురూపం: మెగాస్టార్ చిరంజీవి
- తెల్లవారుజామున 4.30 నిమిషాలకు ఆడపిల్లకు జన్మనిచ్చిన ఉపాసన కామినేని కొణిదెల
- మెగాస్టార్ చిరంజీవి గారిని రావణాసుర పాత్ర కోసం సంప్రదిస్తాం : కోడ్ రామాయణ యూనిట్
సోషల్‌మీడియా ఫాలోవర్స్‌తో పబ్లిసిటీ హీరోలకు లాభమా? నష్టమా? ` స్పెషల్ స్టోరీ
KS Ramaro
sudhakr with falowers
దీని గురించి ఇటీవలే ఓ సాథియా ప్రిరిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవితో అభిలాష వంటి సినిమాలు తీసిన కె.ఎస్. రామారావు స్పందించిన తీరు వాస్తవాలను కళ్ళకుకట్టినట్లుంది. ఇప్పుడు ప్రచారం అంతా సోషల్ మీడియావైపు చూస్తోంది. ఏది జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఒకప్పుడు డైలీ పేపర్లు, మేగజైన్లు వుండేవి. ఇప్పుడు మేగజైన్ లేనేలేవు. డైలీపేపర్లు కేవలం రాజకీయ విషయాలు చూసేందుకు ఉపయోగపడుతున్నాయి తప్పితే సినిమాలకు పెద్దగా ఉపయోగంలేదని అర్థమైంది. అందుకే సోషల్ మీడియావైపు సినిమాల ప్రచారం చేయాల్సివస్తుందని అన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌కు సోషల్ మీడియాకు చెందిన ఫాలోవర్స్ చాలామంది హాజరయి కేరింతలు కొట్టారు.
Dulkar dance with falowers
ఇక వారు అడిగే ప్రశ్నలు వింటే అక్కడి జర్నలిస్టులు ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. ఎక్కువమంది యూత్ మహిళలే ప్రశ్నలు సంధిస్తున్నారు. అందులో ఎక్కువగా.. దుల్కన్ నేను మీ ఫ్యాన్‌ను. ఒకసారి మిమ్మల్ని హగ్ చేసుకోవాలనుంది అని అంటే, మరొకరు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనుందని అడిగారు. ఆ తర్వాత మీకు పెండ్లికాకపోతే నేను మిమ్మల్ని పెండ్లిచేసుకోవాలనుండేదని సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది. ఇంకొకరు డుల్కన్ తో డాన్స్ చేయాలను ఉంది అని అడగగానే ఆయన ఓకే అన్నాడు.
ఇలాంటి ప్రశ్నలు ఒక సినిమా ప్రమోషన్‌కేకాదు యువ హీరోలు నటించే ప్రతి సినిమాలకు ఎక్కువగామారింది.
ఇక మరో హీరో సందీప్ కిషన్ తన సినిమా ప్రమోషన్‌ను కూడా జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీషాప్‌లో ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన నిక్కర్‌తో వచ్చాడు. అక్కడ వచ్చినవారంతా ఇన్‌స్ట్రా ఫాలోవర్సే. వారు తన స్నేహితులనుకూడా తీసుకువచ్చారు. వారి డ్రెస్ చూస్తే ఆశ్చర్యపోకమానదు. ఓ అమ్మాయి అయితే.. హీరోతో.. మిమ్మల్ని హగ్ చేసుకుని వీడియోకాల్ మా ఫ్రెండ్స్‌కూ చూపించాలనుందని ఇంగ్లీషులో మాట్లాడింది. దానికి ఓకే అన్నాడు హీరో. ఇంకొకరైతే మీరు ఈ సినిమాకు సిక్స్‌ప్యాక్ బాడీ చేశారు. ఒకసారి మీ బాడీ చూడాలనుంది అని అడిగారు. నేను షర్డ్ తీస్తే బాగోదు. ఇప్పటికే నిక్కర్‌తో వున్నా. అన్నా వినలేదు. చివరికి ఒకపక్కన గుండీలు తీసి చూపించివరకు వదల్లేదు. మరో ఫాలోవర్ అయితే, అన్నా ఒకప్పుడు తొక్కావు సైకిల్. ఇప్పుడు చేసావు మైకేల్ .. అంటూ తన శైలిలో అరిచాడు.
ఇక్కడకు వచ్చేవారంతా తెలుగు సరిగ్గా పలకడంరాని ఇప్పటి జనరేషన్. ఆ సినిమా ప్రమోషన్‌కు కొల్‌కత్తా, బెంగుళూరు, ముంబై, అస్సాంలో పుట్టి పెరిగినవారు ఇక్కడ సాప్ట్‌వేర్ జాబ్‌లు, చదవుకోవడానికి వచ్చినవారు కావడం విశేషం.
ఇక ఈ ఫాలోవర్స్ ను మించిన ఫాలోవర్స్ సినిమా విడుదల రోజు ఐ మాక్స్ దగ్గర ఉంటారు. ఇక వారు మాట్లాడే భాష తెలుగులో కొత్తగా క్రియేట్ చేస్తారు. అయితే, ఇదంతా సినిమాకు ప్రమోషన్‌గా ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ చెప్పడం విశేషం.
అదేవిధంగా నిఖిల్ తాజా సినిమా స్పై. ట్రైలర్ రిలీజ్‌లో పాల్గొన్నవారంతా సోషల్‌మీడియా ఫాలోవర్స్. వారంతా నిఖిల్ నడుస్తుంటే ఈలలు, కేకలు, కేరింతలే.. ఆయన మాట్లాడానుకుంటే రచ్చరచ్చ చేసేశారు. ఒకరకంగా అభిమానులను మించిపోయారు. వారిని కంట్రోల్ చేయడానికి ఆఫ్టర్ ప్రెస్‌మీట్ మీతో ఫొటో దిగుతానని హామీ ఇవ్వగానే అందరూ శాంతించారు. ఆ తర్వాత ఆయనతో ఫొటోలు దిగడానికి నిఖిల్‌కు చాలా ఓపిక తెచ్చుకోవాల్సివచ్చింది.
ఇక తాజాగా నిన్న రాత్రి హీరో సుధాకర్ కొమాకుల నటించిన నారాయణ అండ్‌కో సినిమా ప్రీ రిలీజ్ జరిగింది. పెద్ద హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు సోషల్ మీడియా ప్రమోటర్స్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలు మీడియాకు కుర్చీలేలేవు. ఇదంతా విడ్డూరంగా వున్నా నమ్మాల్సిన నిజం. ఇక వారిని ఎంటర్‌టైన్ చేయడానికి హీరో బజర్‌దస్త్‌టీమ్‌తో యాంకర్ కమ్ స్కిట్‌లు చేసి అలరించేలా చేశారు. ఫైనల్‌గా వారితో డాన్స్ చేస్తూ అలరించారు. ఈ హీరోకు పెద్దగా సక్సెస్ లేవు. కానీ వచ్చిన ఫాలోవర్స్ జేజేలు పలికేస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ హీరో కాబట్టి సోషల్ మీడియాపై పట్టువున్నవాడు కాబట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి ప్రచారాలు అగ్రహీరోలుకూడా చేస్తున్నారు. కానీ వీరిలా ఇంతలా లోగ్రేడ్ ప్రచారాలు చేయడంలేదని తెలుస్తోంది. దీనిపై పలువురు చిత్ర నిర్మాతలు, దర్శకులు స్పందిస్తూ. కాలంతోపాటు సినిమాలు మారాయి, ప్రచారం మారింది. కానీ ఇంతలా మారుతుందని అనుకోలేదని అంటున్నారు. ముందుముందు ప్రచారం ఇంటిలోపలికి వస్తుందేమోనని సీనియర్ నిర్మాత వ్యాఖ్యానించడం కొసమెరుపు.
