శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (16:12 IST)

మెగాస్టార్ చిరంజీవి గారిని రావణాసుర పాత్ర కోసం సంప్రదిస్తాం : కోడ్ రామాయణ యూనిట్

Code ramayana
Code ramayana
సౌద అరుణ స్టూడియోస్ పతాకంపై డ్రవిడ భూమిని యొక్క ఆత్మ గౌరవ నినాదంతో పాపులర్ రైటర్ సౌద అరుణ స్వీయ దర్శకత్వంలో  నిర్మించిన చిత్రం "కోడ్ రామాయణ".. ఈ చిత్రంటైటిల్ అనౌన్స్ మెంట్ హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన బౌద్ధ బిక్షువు బంతె షీల్ రక్షిత్ మరియు ప్రముఖ రచయిత్రి లలిత. పి. చేతుల మీదుగా "కోడ్ రామాయణ"  ఫస్ట్ లుక్ పోస్టర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది.
 
Code ramayana crew
Code ramayana crew
అనంతరం దుర్వానుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ. .రామాయణాన్ని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది. అందులో మొదటి భాగం పూర్వ రామాయణం ఇది షూట్ పూర్తిచేసుకుని 11 రోజులయ్యింది. మనకు బిడ్డ పుట్టిన తరువాత మనం భారసాల చేసుకోవడం మన ఆచారం. ఆలా ఈ రోజు ఈ సినిమాకు బారసాలలో "కోడ్ రామాయణ" అని నామకరణం చేయడం జరిగింది. కోడ్ రామాయణ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం.అలాగే రామాయణంలో ఏం చెప్పడం కోసం రామాయణం వచ్చింది అనేది ముఖ్య ఉద్దేశ్యం. దీని తరువాత వచ్చే రెండవ భాగం "రావణచరిత్ర" మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుంది. దాంట్లో రావణ పాత్ర ప్రధానంగా ఉంటుంది. తరువాత  వచ్చే మూడవ భాగం "ఉత్తర రామాయణం" ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా చెపుతూ..మన జీవితాలు ఎక్కడనుండి ప్రారంభమయ్యి ఎక్కడకి వెళుతున్నామని మన గడ్డ అయిన డ్రవిడ భూమి ఆత్మ గౌరవం గురించి వివరిస్తూ  భారత దేశంలో ఉన్న కులాలు, మతాలు అన్ని డెమాక్రటిక్ గా సర్వ సమత లాగే ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పిన మన డ్రవిడ భూమి ఏ కారణాలు చేత మరుగున పడి గుర్తింపు లేకుండా ఉండి పోయిందని తెలియ చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. 
 
ఈ అపూర్వ పురాణ కథలను రచించిన ప్రముఖ దర్శకుడు సౌద అందరికి చిర పరిచితుడే..తన రచించిన ఈ బుక్ కు ప్రస్తుతం లక్ష  కాపీస్ కావాలనే డిమాండ్ ఉంది.. ఇప్పటివరకు పుస్తక రూపకంలో పౌరాణిక అధ్యయనాన్ని ఇప్పుడు దృశ్య రూపకంగా తెరపైకి తీసుకువచ్చే  ప్రయత్నం  చేస్తున్నాము. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మెగాస్టార్ చిరంజీవి గారికి చూపించి... నెక్స్ట్ పార్ట్ లో రావణాసుర పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తాము అని అన్నారు.
 
చిత్ర దర్శకులు సౌద అరుణ మాట్లాడుతూ.. కోడ్ రామాయణ  మొదటి భాగం  నామకరణ బాలసాల కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు.అప్పుడు ఇప్పుడు సంగీత సాహిత్యాలతో వర్దిల్లిన గడ్డే ద్రవిడ భూమి. ఈ గడ్డపై పుట్టిన మేము జై శ్రీ రావణ అని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది.ద్రవిడ భూమి ఆత్మ గౌరవం అనే నినాదంతో డ్రవిడ భూమి యొక్క గొప్ప తనాన్ని ప్రపంచం మరింత అర్థం చేసుకోవడానికే ఈ సినిమా చేస్తున్నాము తప్ప ఎవరినీ వ్యతిరేకించడానికి ఈ సినిమా తీయడంలేదు. ఈ "కోడ్ రామాయణ" లో వచ్చే మూడు  భాగాల .ప్రాజెక్టు చేయడం ఒక దశాబ్ద కాలం పట్టే యజ్ఞం. ఇప్పటి వరకు మేము మూడవ వంతు పని మాత్రమే చేయడం జరిగింది. ఇందులో 50 మంది నటీ నటులు, సాంకేతిక నిపుణులు పని చేయడం జరిగింది.ఇంకా అందరి వివరాలు త్వరలో తెలియజేస్తాం.