శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (18:46 IST)

వీర సావర్కర్ పోరాటయోధుని గాధను తెర కెక్కించబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

Ram Charan
Ram Charan
కొణిదెల రామ్ చరణ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు అని మాత్రమే తెలుగువారికి ఒకప్పుడు తెలుసు. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని యావత్తు ప్రపంచం నేడు చెప్పుకొనే స్థాయికి రామ్ చరణ్ ఎదిగారు. విశ్వ నట చక్రవర్తిగా (Global Star) రామ్ చరణ్ ప్రసంశలు అందుకొంటున్నాడు. తాను అధిరోహిస్తున్న ఆ విశ్వ శిఖరంపై తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి కూడా చరణ్ బాబు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు.
 
V Mega Productions బేనర్ మీద లాభనష్టాలతో సంబంధం లేకుండా "ది ఇండియా హౌస్" పేరుతో చరిత్రలో మరుగునపడ్డ సమరయోధుడు  వీర సావర్కర్ లాంటి యోధుల పోరాటగాధలని నిర్భయంగా తెర కెక్కించబోతున్న డేరింగ్, డాషింగ్ & డైనమిక్ ప్రొడ్యూసర్ మన తెలుగుబిడ్డ  కొణిదెల రామ్ చరణ్. దీని ద్వారా సమాజంమీద, సామజిక అంశాల మీద రామ్ చరణ్'కి ఉన్న ఆశక్తిని అర్ధం చేసికోవచ్చు.
 
చరణ్ ఆస్కార్ క్రిటిక్స్ ఛాయస్ సూపర్ అవార్డును అందు కున్నారు. G20 సమ్మిట్'కి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.  ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ఫంక్షన్'లో కీలక పాత్ర పోషించారు. ఇండియా టుడే కాంక్లేవ్ మీట్'లో పాల్గొన్నారు. NDTV ఇండియా ఐకాన్ అవార్డును కూడా అందుకొన్నారు. ఒక మెగాస్టార్'కి కుమారుడు. మరొక పవర్ స్టార్ తనకు బాబాయి, మంచి మిత్రుడు. అయినప్పటికీ రామ్ చరణ్ ఒదిగే ఉంటారు.
 
తండ్రి చిరంజీవిగారు  తమ ఖ్యాతిని మొగల్తూరు నుండి చెన్నైకి  తీసికెళ్ళి... అక్కడనుండి ఆ ఖ్యాతిని దక్షిణదేశ వ్యాప్తం చేసారు. కొణిదెల చిరంజీవి అంటే తెలుగు ప్రజలే కాకుండా యావత్తు దక్షిణ భారతదేశ ప్రజలు గర్వపడేలా చేసారు. చిరంజీవి మా తెలుగుబిడ్డ. చిరు మా దక్షిణాది బిడ్డ అని యావత్తు దక్షిణాది ప్రజలు తలెత్తుకొని చెప్పుకొనేలా చిరంజీవి గారు చేయగలిగారు.
 
అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ ఖ్యాతిని దక్షిణాది నుండి  ఖండాంతరాలు దాటించి... నేడు విశ్వ వ్యాప్తం చేయగలిగారు. రామ్ చరణ్ అంటే అల్లూరి సీతారామ రాజు, అల్లూరి సీతారామరాజు అంటే రామ చరణ్ అన్నట్లు నేడు సమస్త విశ్వం రామ్ చరణ్ వంక చూస్తున్నది. రామ్ చరణ్ ఖ్యాతి రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తం కావడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనికి ప్రతీ తెలుగువాడు గర్వపడాలి.
 
ఒక తెలుగు బిడ్డ ఖ్యాతి విశ్వవ్యాప్తం కావడంలో రామ్ చరణ్ ప్రతిభ అసామాన్యమైంది.   రామ్ చరణ్'లో జన్మతః వచ్చిన లక్షణాలతో పాటు కుటుంబ పెంపకం వారసత్వ లక్షణాలు కూడా చరణ్'కి కలిసి వచ్చాయి అని చెప్పక తప్పదు. అలానే రామ్ చరణ్'లో ఉండే నిత్యం కష్టపడే విధానం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే చరణ్ తత్త్వం  కూడా దీనికి తోడైంది అని చెప్పాలి
 
తాతయ్యలు, తల్లిదండ్రులు, బాబాయిలు, మామయ్యలలో ఉన్న సద్గుణాలను అన్నింటిని అవపోసన పట్టి, తన కృషితో వాటికి మరిన్ని మెరుగులు దిద్ది  రామ్ చరణ్ తనలో ఇమిడ్చికొన్నారు.  వాటిని రామ్ చరణ్ తనలో ఇమిడ్చుకోవడమే కాకుండా వాటినన్నిటినీ ఆచరణలో పెట్టిన ఉత్తమ సద్గుణ సంపన్నుడిగా, రోల్ మోడల్'గా రామ్ చరణ్ ఎదిగారు.
 
రామ్ చరణ్ పురోభివృధికి ముఖ్య కారకురాలు కొణిదెల వంశంలోకి ప్రవేశించిన సీతమ్మ తల్లి లాంటి శ్రీమతి సురేఖ చిరంజీవి గారు. అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి అను సంధాన కర్తగా ఉంటూ యావత్తు మెగా కుటుంబ భాద్యతలను  సహనంతో మోసిన నారీమణి మన శ్రీమతి సురేఖ చిరంజీవి గారు. చిరంజీవి గారికి చేదోడుగా ఉంటూనే ఒక పవన్, ఒక చరణ్ అలానే యావత్తు మెగా హీరోల అభ్యన్నతిలో శ్రీమతి సురేఖ చిరంజీవి గారి పాత్ర అమోఘం. 
 
అలానే సమాజంలోని అంతరాలను, ఆకలి బాధలను, పేదపిల్లల కష్టాలను  చిన్న వయస్సులోనే అవపోసన పట్టిన ఉపాసన రామ్ చరణ్ సహధర్మ చారిణిగా రావడం కూడా రామ్ చరణ్ జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. సహధర్మ చారిణిగా ఉపాసన చరణ్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా చెప్పాలి.
 
హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు రామ్ చరణ్'కి రావడం ఒక ఎత్తు. అయితే ఆ అవార్డు తీసికొన్నప్పుడు రామ్ చరణ్ మాట్లాడిన మాటలు గాని, అక్కడ ఇంటర్నేషనల్ మీడియాని చరణ్ హేండిల్ చేసిన విధానంగాని రామ్ చరణ్ లోని ఔనత్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయని విమర్శకులు సైతం కొనియాడారు.
 
RRR సినిమాకుగాను వచ్చిన హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు ఫంక్షన్'లో ఒక అవార్డు ప్రేసెంటెర్'గా ఒక గ్లోగల్ స్టార్'గా, ఒక ప్రధాన నటుడిగా రామ్ చరణ్ పోషించిన పాత్ర ప్రపంచ సినీ, రాజకీయ క్రిటిక్స్  ప్రసంశలు అందుకున్నది. ఆ RRR సినిమాలో రామ్ చరణ్ పోషించిన ప్రధాన పాత్ర  రామ్ చరణ్ నటనలోని మెట్యూరిటీ స్థాయిని ప్రపంచానికి తెలియ జేసింది అని ప్రపంచ సినీ విమర్శకులు సైతం అంటున్నారు.
 
రామ్ చరణ్ పోషించిన రామరాజు పాత్రకు గాను ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్స్ జేమ్స్ కేమరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి వారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్'పై ప్రశంశల వర్షం కురిపించారు.
 
కాశ్మీర్'లో జరిగిన G20 సమ్మిట్'కి భారత దేశం తరుపున ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం రామ్ చరణ్'కి దక్కింది. ఆ సమ్మిట్'లో చరణ్ వ్యవరించిన తీరు, అక్కడ దేశ విదేశీ ప్రముఖులతో చరణ్ మాట్లాడిన తీరు, జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రామ్ చరణ్ మాట్లాడిన తీరు అద్భుతం. జాతీయ, అంతర్జాతీయ సినీ రాజకీయ విమర్శకులు సైతం  రామ్ చరణ్ యొక్క హుందాతనాన్ని మరొక్కసారి మెచ్చుకొన్నారు.
 
చిరుత, మగధీర, ఆరంజ్, రచ్చ, నాయక్, తూఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం, వినయ్ విధేయ రామ, RRR , ఆచార్య లాంటి చిత్రాల్లో రామ్ చరణ్ నటించారు. చరణ్ నటించిన మొట్టమొదటి చిత్రం అయిన చిరుతకి ఫిలిం ఫేర్ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు రావడంతో చరణ్ సినీ జీవితం చక్కటి శుభారంభంతో మొదలు అయ్యింది.
 
ఆ తరువాత వచ్చిన మగధీర హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు చిత్రంగా నాడు రికార్డులు సృష్టించింది. చరణ్ నటించిన మగధీర చిత్రానికి బెస్ట్ యాక్టర్ ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకొని కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. రామ్ చరణ్ తనలోని నట విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి మగధీర సినిమా ఎంతగానో ఉపయోగపడింది.
 
చరణ్ నటించిన చిత్రాల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిన సినిమా రంగస్థలం. రామ్ చరణ్ సినీ జీవితంలో రంగస్థలం  ఎప్పటికీ మిగిలిపోతుంది అని చెప్పాలి. రంగస్థలంలోని చిట్టిబాబు అనే పాత్రలో చరణ్ నటనకు గాను  ఫిలిం ఫేర్ అవార్డుతో పాటు ఈ చిత్రానికి పలు అవార్డులు దక్కాయి. రామ చరణ్ రంగస్థలం సినిమా ద్వారా పలువురి ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలను కూడా చరణ్ అందుకున్నాడు.
 
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రం వేల  కోట్ల రూపాయిల కలెక్షన్స్ సాధించిన ఉత్తమ చిత్రంగా మిగిలింది. RRR లో రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామ రాజు పాత్రతో రామ చరణ్ జాతీయ, అంతర్జాతీయ గుర్తింపుని దక్కించుకున్నాడు.
 
ఇవి అన్నీ కూడా రామ్ చరణ్'లో ఉన్న సామజిక స్పృహని, సామజిక బాధ్యతని తెలియ జేస్తున్నాయి. సినీ కళామతల్లికి చరణ్ బాబు తనదైన శైలిలో సేవ చేస్తున్నారు.
 
ఇప్పటివరకు రామ్ చరణ్ సాధించింది రామ్ చరణ్ జీవితానికి నాందీ ప్రస్తావనగానే భావించాలి. రామ్ చరణ్ తన జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలి.  రాబోయే రోజుల్లో సామజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో కూడా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
 
నాన్న చిరంజీవి గారిలో ఉన్న విష్ణుతత్వాన్ని,  బాబాయ్ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న శివతత్వాన్ని రామ్ చరణ్ పుణికి పుచ్చుకొని వారి ఆశయాలను నెరవేరుస్తారని, తెలుగుగడ్డ పేరు ప్రఖ్యాతులను మరింత అత్యున్నత స్థాయికి తీసికెళ్లగలరని ఆశిస్తూ .బెంగుళూరు తో పాటు విశ్వ వ్యాప్త  అభిమానులు కోరుకుంటున్నారు.