శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (15:40 IST)

చిరంజీవిగారి భరోసాతో బయట తిరగుతున్నానంటున్న నిర్మాత

Anil sunkara, chiru
Anil sunkara, chiru
మెగాస్టార్‌ చిరంజీవి ఐయామ్‌ హియర్‌ డోండ్‌ ఫియర్‌.. అంటూ ఇచ్చిన హామీతో నేను హాయిగా బయట తిరగగలుగుతున్నాయని నిర్మాత అనిల్‌ సుంకర అంటున్నారు. ఎ.కె. ఎంటర్‌టైన్‌ మెంట్‌ బేనర్‌లో ఆయన నిర్మిస్తున్న చిత్రం భోళాశంకర్‌. భారీ తారాగణం. భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతుంది. మొన్ననే యాక్షన్‌ ఎపిసోడ్‌ కూడా తీశాం. ఈలోగా ఈనెల 28న నేను నిర్మించిన ఏజెంట్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.
 
ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్‌ పనులు దగ్గరపడడంతో పనిఒత్తిడి వుంది. అందుకే చిరంజీవిగారి షూటింగ్‌కు వెళ్ళలేకపోతున్నాను. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్‌ గారు ‘ఎందుకు టెన్షన్‌. నేను చూసుకుంటాను గదా. మీరు హాయిగా ఏజెంట్‌ సినిమాను రిలీజ్‌ చేసుకోండని’ ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే పలు ప్రమోషన్‌ పరంగా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నానని అన్నారు. 
 
పాన్‌ ఇండియా సినిమాగా తీసిన అఖిల్‌ ఏజెంట్‌ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్‌ చేస్తున్నట్లు చెప్పారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌లలో ఏప్రిల్‌ 28న వేరే సినిమాలు వారి భాషల్లోవి విడుదలకావడంతో థియేటర్లు దొరకలేదని తెలిపారు.