1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (14:31 IST)

ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రధాని మోడీ ఘన నివాళి

prakash singh badal
శిరోమణి అకాలీదళ్ పార్టీ అగ్రనేత, పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. ఇందుకోసం ప్రధాని బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి చంఢీఘర్‌కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుకాగ శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
 
బాదల్ మృతిపై ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ, ప్రకాశ్ సింగ్ మృతి తనకు వ్యక్తిగతంగా నష్టం. ఎన్నో దశాబ్దాలుగా ఆయనతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను" అంటూ ట్వీట్ చేశారు. దేశానికి బాదల్ ఎన్నో సేవలు అందించారనీ, పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారంటూ ప్రధాని కీర్తించారు. బాదల్‌ను గతంలో కలుసుకున్న ఫోటోను సైతం ఈయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. 
 
మరోవైపు, బాదల్ మృతిపై కేంద్ర సర్కారు రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. 1957లో సర్పంచ్‌గా ఎన్నికై బాదల్ ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రానికి ఐదు పర్యాయాలపాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఎన్డీయే భాగస్వామిగాను ఎస్.ఏ.పీ సుధీర్ఘకాలంగా ఉంది. నూతన రైతు చట్టాలకు నిరసనగా రైతుల ఆందోళన నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి ఎస్.ఏ.పీ 2020లో బీజేపీతో సంబంధాలను తెంచుకుంది.