శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (20:15 IST)

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Devi Sri Prasad
Devi Sri Prasad
నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. RRR సినిమా  ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లు తో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను టీజీ.విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  సంయుక్తంగా నిర్వహించారు. 
 
రీసెంట్ గా యంగ్ సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ లు నిర్వహించారు.  ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ.విశ్వప్రసాద్ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో ఇదే మాదిరిగా మ్యూజిక్ కన్సర్ట్ లను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియో ను ఇంస్ట్గ్రామ్ మరియు ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా లాంచ్ చేసారు. 
 
ఈ కన్సర్ట్  జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29 న చికాగో లో జరగునున్నాయి. 
ఈ కన్సెర్ట్ లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృద్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ మరియు నటి అనసూయ ఈ షోస్ ను హోస్ట్ చేయనున్నారు.