సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (16:12 IST)

చిరంజీవి భోళా శంకర్ టీజర్ డేట్ ఫిక్స్

Bhola Shankar
Bhola Shankar
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా టీజర్ డేట్ ఫిక్స్ అయింది. టీజర్ లాంచ్ ఈవెంట్ రేపు అనగా జూన్ 24న సంధ్య 70MM, హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానుంది. తమిళ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కుతోంది. దర్శకుడు మెహర్ రమేష్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో హీరో సుశాంత్ కూడా నటిస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, రష్మి గౌతమ్ నటిస్తున్నారు. 
 
మెగా సెలబ్రేషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొనండి అని ఫాన్స్ కు పిలుపు ఇచ్చారు. ఈ సినిమా  బిజినెస్ పరంగా  నైజాం ఏరియాలో 32 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందనేది  ఇన్ సైడ్ టాక్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 11 విడుదల చేస్తున్నారు.