1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress Keerthy Suresh comments on Dr. Priyanka Reddy case

డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య.. కర్మను నమ్ముతానంటున్న కీర్తి సురేష్

#RIPPriyankaReddy #JusticeForPriyankaReddy #Keerthy Suresh
హైదరాబాద్ నగర సమీపంలో జరిగిన పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య కేసుపై సినీ నటి కీర్తి సురేష్ స్పందించింది. ఇది కర్మ కాకుంటే మరేంటని ఆమె వ్యాఖ్యానించింది. డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యపై ఆమె ట్విట్టర్‌లో స్పందించింది. తాను కర్మను నమ్ముతానని, అది అనుక్షణం వెంటాడుతూనే ఉంటుందని వ్యాఖ్యానించింది.
 
'డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై అత్యాచారానికి పాల్పడి, సజీవదహనం చేశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రోజురోజుకూ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ వంటి నగరంలో ఇంత దారుణ ఘటనకు ఎవరిని నిందించాలి? 
 
రోజులో ఏ సమయంలోనైనా ఓ అమ్మాయి సురక్షితంగా తిరిగే రోజులు ఇండియాలో ఎప్పుడు వస్తాయి? నిందితులందరికీ కఠిన శిక్ష విధించాల్సిందే. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ కష్టం నుంచి వారు త్వరగా బయట పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను కర్మను నమ్ముతాను. అది 24/7 పనిచేస్తూనే ఉంటుంది' అంటూ తన ట్వీట్‌లో పేర్కొంది. 

 
తర్వాతి కథనం
క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు టైటిల్ మారిందా?