మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 28 నవంబరు 2019 (19:36 IST)

90 ఎం.ఎల్ మ‌ద్య‌పానాన్ని ప్రొత్స‌హించే సినిమానా?

యంగ్ హీరో కార్తికేయ, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం` 90 ఎంఎల్`. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైన అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
అయితే... 90 ఎం.ఎల్ టైటిల్‌ని బ‌ట్టి ఇది మ‌ద్య‌పానాన్ని ప్రొత్స‌హించే సినిమాలా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇదే విష‌యం గురించి డైరెక్ట‌ర్‌ శేఖ‌ర్ రెడ్డిని అడిగితే... ఈ చిత్రంలో హీరోకి ఆరోగ్య రీత్యా ఆల్కహాల్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది అంతే తప్ప.. సినిమాలో ఎక్కడా మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలు లేవు. 90ఎంఎల్ అనేది ఎంటర్టైన్మెంట్‌తో కూడా కంప్లీట్ లవ్ స్టోరీ అని చెప్పారు.
 
ఈ మూవీ స్పెషాల్టీ ఏంటి అని అడిగితే... జ‌నాలకు కథ పాయింట్ అర్ధంమవ్వాలనే విధంగా ముందుగా క్యారెక్టర్‌ని ఎలివేట్ చేశాం. మొదటి పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్ని అంశాలు జనాలకు నచ్చే విధంగా జాగ్రత్తపడ్డాం. సినిమాలో రవి కిషన్ పాత్రను రివీల్ చేయలేదు. ఆ పాత్ర కొంచెం సైకో షేడ్స్‌లో ఉంటుంది. అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఆ పాత్ర అందరికి నచ్చుతుంది. సినిమా ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుందన్నారు.