ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 28 నవంబరు 2019 (22:08 IST)

క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు టైటిల్ మారిందా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చిన వ‌ర్మ క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు పొలిటికల్ సెటైర్ మూవీ అని.. ఇందులో మెసెజ్ కూడా ఉంది. త‌న కెరీర్లో ఫ‌స్ట్ టైమ్ మెసేజ్ మూవీ తీసాన‌ని చెప్పాడు.
 
అయితే.. సెన్సార్ స‌భ్యులు అభ్యంత‌రం చెబితే టైటిల్ మార్చ‌డానికి ఆల్రెడీ ప్రీపేర్ అయ్యాడ‌ట‌. టైటిల్ మార్చాల్సి వ‌స్తే.. ఏ టైటిల్ పెట్టాల‌నుకుంటున్నాడో కూడా వ‌ర్మ ఎనౌన్స్ చేసారు. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటంటే... అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. ఈ సినిమాని అడ్డుకోవాల‌ని కేఏ పాల్ న్యాయ‌ప‌రంగా పోరాడుతున్నారు.
 
వ‌ర్మ మాత్రం ఈ పోరాటాన్ని లైట్‌గా తీసుకున్నాడు. అస‌లు కె.ఏ. పాల్ ఎంత సీరియ‌స్‌గా మాట్లాడినా కామెడీగానే ఉంటుంద‌న్నారు. అలాగే ఈ సినిమా ద్వారా ఏ కులాన్ని త‌క్కువ చేయ‌డం లేద‌ని.. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని చెప్పారు. మ‌రి.. వ‌ర్మ న‌మ్మ‌కం నిజం అవుతుందా..? లేదా..? అనేది చూడాలి.