సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 31 అక్టోబరు 2019 (20:01 IST)

ఓ నా బుజ్జి జొన్నా, నువ్వు దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి: వర్మ షాకింగ్ కామెంట్

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంపైన రచ్చ మొదలైంది. మొన్నటివరకూ అటు తెదేపా ఇటు వైకాపా వర్మపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఇపుడు సీన్లోకి రచయిత జొన్నవిత్తల వచ్చారు. తనను జొన్నవిత్తుల చౌదరి అంటూ వర్మ సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పైన తను పప్పువర్మ అనే బయోపిక్ తీస్తానంటూ చెప్పడమే కాకుండా వర్మ బతికున్న శవం లాంటివాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
మరి ఈ కామెంట్లు చూస్తే వర్మ వూరుకుంటాడా... రివర్స్ కౌంటర్ ఇచ్చేశాడు. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలతో ట్వీట్ చేశాడు. ఆయన రాతల్లోనే... ‘ఓ నా బుజ్జి జొన్నా, నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ. లేకపోతే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్. వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్.. కానీ ఐ లవ్ యు డా’ అంటూ ట్వీటేశారు. మరి దీనిపై జొన్నవిత్తుల ఎలా స్పందిస్తారో చూడాలి.