ఈ టైమ్‌లో నాగ్ ఆ.. ప్రయోగం చేస్తున్నారా..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. దీని తర్వాత బంగార్రాజు మూవీ చేయాలనుకున్నాడు కానీ... ఈ సినిమా కథపై ఎంతగా వర్క్ చేసినప్పటికీ నాగ్ ఎందుకనో ధైర్యం చేయలేకపోతున్నాడు.
అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు బంగార్రాజు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. రేపో మాపో బంగార్రాజు సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుంటే... ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది.
ఇంతకీ కొత్త డైరెక్టర్ ఎవరంటే... మహేష్ మహర్షి సినిమా రైటర్లలో ఒకరైన సోలోమన్ చెప్పిన కథ విని, అతనికే డైరక్షన్ అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మించే అవకాశం వుంది.
ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలి అనుకుంటున్నారట నాగ్. మరి.. ఈ సినిమాతో అయినా నాగ్‌కి సక్సెస్ వస్తుందేమో చూడాలి.