మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (11:31 IST)

#KRKRTrailer2 : జగన్మోహన్ రెడ్డినీ వదిలిపెట్టని రాంగోపాల్ వర్మ

తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు". ఈ  చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుండగా, సిద్ధార్థ తాతోలు - రాంగోపాల్ వర్మలు కలిసి సంయుక్తంగా నిర్మించారు. 
 
ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కి సంబంధించిన అన్ని అంశాల‌ని ఆస‌క్తిగా చూపించారు. గత ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌పై క‌ట్ చేసిన ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 
 
ముఖ్యంగా, ఈ ట్రైలర్‌లో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో పాటు.. వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలిపెట్టలేదు. వారి పాత్రల్లో ఒదిగిపోయేలా నటులను ఎంపిక చేశారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.