సంబంధిత వార్తలు
- హ్యాపీడేస్ లెక్చరర్ కమలిని ముఖర్జీకి పుట్టిన రోజు
- వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు.. స్టార్ హీరోలకు చుక్కలు చూపించే విలన్!
- బాక్సర్ మేరీ కోమ్ పుట్టినరోజు.. పేపర్లో ఫోటో వచ్చేసరికి ఆమె తండ్రి ఏం చేశారంటే..?
- నడిరోడ్డుపై నటికి వేధింపులు.. నటి చేతికి పట్టుకుని..?
- 23 యేళ్ల హీరోయిన్.. 40 యేళ్ళ దర్శకుడితో డేటింగ్? (video)
శ్రద్ధా దాస్ పుట్టినరోజు.. అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోదు.. కానీ సరైన బ్రేక్..?
Shradha Doss
అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇంకా తెలుగులో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దగుమ్మ. కాగా ఈ భామ ఈరోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటోంది.
గ్రాడ్యుయేట్ అయిన శ్రద్ధాదాస్.. పియూష్ మిశ్రా వర్క్ షాపుల్లో పనిచేసింది. పలు ప్రకటనల్లో నటించింది. తెలుగులో సిద్ధు ఫ్రమ్ సికాకుళంలో నటించి శ్రద్ధాదాస్.. ప్రస్తుతం బాలీవుడ్ వైప్ దృష్టి మరల్చింది. 2010లో శ్రద్ధాదాస్ నటించిన లాహోర్ సినిమానే ఆమె తొలి బాలీవుడ్ మూవీ.
Shradda Doss
ఈ సినిమాల తర్వాత లక్కీ కబూతర్, జీద్ సినిమాల్లోనూ కనిపించింద. అలాగే తెలుగులో ఆర్య2, మంత్ర, చంద్రముఖి (నాగవల్లి)లో నటించింది. అలాగే బెంగాలీ సినిమాలోనూ కనిపించింది. ఇంకేముంది..? అందాలు అదరహో అంటున్న టాలీవుడ్, బాలీవుడ్‌లో ఓ మంచి హిట్ కూడా ఆమెను వరించలేదు. ఆమె ఖాతాలో సూపర్ హిట్ నమోదు కావాలని కోరుకుందాం..
తర్వాతి కథనం
