బర్రెతో సెల్ఫీ తీసుకున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
హీరో, హీరోయిన్లకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. కొందరు హీరోలకు యూత్ నుండి పెద్ద వాళ్ల వరకు అభిమానులు ఉంటారు. మరికొందరు హీరోలంటే అమ్మాయిలు పడిచస్తారు. ఇంకొందరి హీరోల సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగ
హీరో, హీరోయిన్లకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. కొందరు హీరోలకు యూత్ నుండి పెద్ద వాళ్ల వరకు అభిమానులు ఉంటారు. మరికొందరు హీరోలంటే అమ్మాయిలు పడిచస్తారు. ఇంకొందరి హీరోల సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా నచ్చుతుంది. కానీ ఓ స్టార్ హీరోకు ఒక మూగజీవి ఫ్యాన్ అంటే నమ్ముతారా... అది కూడా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం ఎప్పుడైనా చూశారా? ఇంతకీ ఆ జీవి ఎవరో కాదు బర్రె. బాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ అంటే బర్రెలు పడి చస్తాయట.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. హీరోలకు మనుషులు అభిమానులుగా ఉండడం సహజమే కానీ వెరైటీగా నాకు బర్రెలు అభిమానులుగా ఉండడం అందరిని అబ్బురపరుస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అక్షయ్ మాట్లాడుతూ.. ''బర్రెలు... నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తున్నాయి. ప్రేమగా వాటిని నేను స్వాగతిస్తున్నానంటూ'' తన కారు వెంట ఫాలో అవుతున్న బర్రెలతో సెల్ఫీ దిగి మరీ ట్విట్టర్లో పెట్టాడు అక్కీ. ఓ అభిమాన బర్రెతో ఆయన నవ్వుతూ సెల్ఫీ దిగుతుండగా.. ఆ బర్రె ఆయనను ఎంత ఇష్టంగా చూస్తుందో కదా... దీన్ని బట్టి చూస్తుంటే నిజంగా ఈ బర్రె అక్కీ ఫ్యానే అని అనిపించకమానదు.

