అమ్మ కలను నేరవేర్చే విజయ రాఘవన్ - 17న విడుదల
Vijaya Raghavan prerelease
అనంతరం విజయ్ ఆంటోని మాట్లాడుతూ, కిల్లర్ సినిమా తర్వాత ప్యాండమిక్ కారణంగా తెలుగు ప్రేక్షకులను కలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఈ గ్యాప్ తర్వాత విజయ రాఘవన్ వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు రాజా, కమల్, ప్రదీప్, ధనంజయ్ బాగా ఖర్చు పెట్టి ఓ మంచి కమర్షియల్ సినిమా చేశారు. అలాగే తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న శ్రీకరి ఫిలింస్ రవిచంద్రా రెడ్డి, శివారెడ్డిలకు అభినందనలు. ఓ ఎడిటర్‌గా కూడాఈ సినిమాను చాలా సార్లు చూశాను. నివాస్ ప్రసన్న అద్భుతమైన సంగీతాన్నిఅందించారు. తనతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకున్నాను. భాష్యశ్రీగారు మంచి సంభాషణలు, పాటలు అందించారు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
చిత్ర దర్శకుడు ఆనంద కృష్ణన్ మాట్లాడుతూ, దర్శకుడిగా నా తొలి చిత్రం మెట్రో తెలుగులో విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. ఇది నా రెండో సినిమా. ఇది కూడా తెలుగులో భారీగా విడుదలవుతుండటం హ్యాపీగా ఉంది. తెలుగులో గ్రాండ్‌గా సినిమా విడుదలవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునే ఓ యువకుడి కథే ఇది. జీవితంలో ఎన్నో సాధించాలనుకునే హీరో, తన తల్లి కోరికను తీర్చాలనుకుంటాడు. ఆ క్రమంలో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి తనెలా బయటపడతాడు అనేదే ఈ చిత్రం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అంతే కాకుండా సమాజంలో మనకు ఎదురయ్యే రాజకీయ పరమైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాలనే సందేశం కూడా ఇస్తుంది. ఇలాంటి ఓ సినిమాను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, విజయ్ ఆంటోనిగారికి థాంక్స్. నివాస్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. హీరోయిన్ ఆత్మిక చాలా మంచి రోల్‌ను క్యారీ చేసింది. సెప్టెంబర్ 17న విడుదలవుతున్న సినిమాను ఆదరించండి అన్నారు.
హీరోయిన్ ఆత్మిక మాట్లాడుతూ మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి ఓ మంచి మూవీ విజయ రాఘవన్ సెప్టెంబర్ 17న మీ ముందుకు రాబోతుంది. సినిమాను థియేటర్స్ చూసి విజయాన్ని అందించండి. సినిమా తప్పకుండా మిమ్మల్ని మెప్పిస్తుంది అన్నారు.
రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్, అనువాదంలో వర్క్ చేసిన అందరూ సినిమా గ్యారంటీ హిట్ అని చెప్పారు. ఈ సినిమాలో విజయ రాఘవన్‌గా నటించిన విజయ్ ఆంటోని ఓ ట్యూషన్ మాస్టర్. తన అమ్మ కన్న కలను నేరవేర్చడానికి ఓ ప్రాంతానికి వస్తాడు. ఆయన పాత్రలో చాలా డైమన్షన్స్ ఉంటాయి. చాలా విభిన్నంగా ఉండే సినిమా అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కె.ప్రసన్న మాట్లాడుతూ మంచి కథకు తగ్గ సాంగ్స్ కుదిరాయి. అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనిగారికి, దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు.
శ్రీకరి ఫిలింస్ అధినేతలు రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి మాట్లాడుతూ విజయ్ ఆంటోనిగారికి థాంక్స్. ఆనంద్ కృష్ణన్‌గారు అద్భుతమైన కథతో సినిమా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాపై కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. సెప్టెంబర్ 17న విడుదలవుతున్న మా సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం అన్నారు.
రామచంద్రరాజు మాట్లాడుతూసెప్టెంబర్ 17న విజయ రాఘవన్ థియేటర్స్‌లో విడుదలవుతుంది. మంచి సినిమా. దాన్ని థియేటర్స్‌లో చూసి ఎంకరేజ్ చేయండి. ఆనంద కృష్ణన్, విజయ్ ఆంటోనిగారికి, నిర్మాతలకు థాంక్స్ అన్నారు.
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ కమల్ మాట్లాడుతూ విజయ్ రాఘవన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. సెప్టెంబర్ 17న థియేటర్స్‌లో మెప్పించడానికి రాబోతున్నాం. ప్రేక్షకులు సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం అన్నారు.
